రిలయన్స్
సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి భారతీయ సంపన్నుల్లో అగ్రస్థానాన్ని కైవసం
చేసుకున్నారు. 360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023లో ఆయన తొలి స్థానంలో
ఉన్నారు. అంబానీ వ్యక్తిగత సంపద విలువ రూ.
8.08 లక్షల కోట్లు. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ రూ. 4.74 లక్షల కోట్లతో
దేశంలో రెండో స్థానంలో ఉన్నారు.
సీరమ్
ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకుడు సైరస్ ఎస్ పూనావాలా మూడో స్థానంలో ఉండగా, ఆయన సంపద
విలువ రూ.2,75, 500 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే ఆయన ఆస్తి విలువ 36 శాతం
పెరిగింది.
శివనాడార్,
గోపిచంద్ హిందూజాలు రూ. 228, 900 కోట్లు, రూ. 1,76,500 కోట్లతో నాలుగు, ఐదు
స్థానాల్లో నిలిచారు.
సన్ ఫార్మసూటికల్
ఇండస్ట్రీస్ చైర్మన్ దిలీప్ సంఘ్వీ రూ. 1,64,300 కోట్ల ఆస్తితో ఆరో స్థానంలో ఉన్నారు.
కనీసం
వెయ్యి కోట్ల సంపద కల్గిన వారికే ఈ జాబితాలో చోటు దక్కింది. జెఫ్టో వ్యవస్థాపకుడు కైవల్య
వోహ్రా(22) ఈ జాబితాలో అత్యంత పిన్న వయస్కుడు.
ఈ జాబితాలో అత్యధికంగా
ఫార్మారంగానికి చెందిన 133 మందికి చోటు దక్కింది.
ధనవంతులు
అత్యధికంగా ఉన్న నగరాల్లో ముంబై తొలి స్థానంలో నిలిచింది. అక్కడ 328 మంది అపర
కుబేరులు ఉన్నారు.
తెలుగు
రాష్ట్రాలకు చెందిన 105 మంది సంపన్నులు ఈ జాబితాలో ఉన్నారు. వీరిలో 87 మంది
హైదరాబాద్ లోనే ఉంటున్నారు.
దివి
లేబొరేటరీస్ కు చెందిన మురళి దివి కుటుంబం రూ. 55, 700 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉంది. మేఘా
కంపెనీ వ్యవస్థాపకులు పి .పిచ్చిరెడ్డి రూ. 37,300 కోట్ల సంపదతో 37వ స్థానంలో
ఉండగా, రూ. 35,800 కోట్లతో పీవీ కృష్ణా రెడ్డి 41వ ప్లేస్ లో ఉన్నారు.
హెటిరో
ల్యాబ్స్ కు చెందిన బి. పార్థసారధి రెడ్డి కుటుంబం రూ. 21,000 కోట్లతో 93వ స్థానం
దక్కించుకోగా, అపోలో హాస్పిటల్స్ కు చెందిన ప్రతాప్ రెడ్డి రూ. 20,900 కోట్ల
వ్యక్తిగత సంపదతో 99వ స్థానంలో ఉన్నారు.