వన్డే
వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా నేడు భారత జట్టు, ఆప్ఘనిస్తాన్ల మధ్య మ్యాచ్
జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి.
భారత
జట్టు తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా మీద గెలిచి జోరు మీద ఉండగా, మొదటి మ్యాచ్ లో
బంగ్లాదేశ్ చేతిలో ఓడిన ఆప్ఘనిస్తాన్ టీమ్, భారత్ పై గెలిచి సంచనలం సృష్టించాలని
చూస్తోంది.
ఈ
మ్యాచ్ కు కూడా ఓపెనర్ గిల్ దూరం కావడంతో ఇషాన్, రోహిత్ ఓపెనర్లుగా వెళ్ళనున్నారు.
శనివారం పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్కు కూడా గిల్
దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
అయినప్పటికీ వారంపాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారు.
పిచ్ బ్యాంటింగ్ కు అనుకూలం. ఇక్కడ జరిగిన చివరి
ఆరు వన్డేల్లో మొదటి బ్యాటింగ్ చేసిన జట్లే ఐదుసార్లు విజయం సాధించాయి.
ఈ ప్రపంచ కప్ లో భాగంగా ఇక్కడ ఇప్పటికే ఓ మ్యాచ్
జరగగా అందులో దక్షిణాఫ్రికా 428 పరుగులు చేయగా, శ్రీలంక 300 పరుగులు చేసింది.
ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఇప్పటి వరకు మొత్తం
8 మ్యాచ్ లు జరగగా, ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచిన న్యూజీలాండ్, పాకిస్థాన్ జట్లు
నాలుగేసి పాయింట్లతో తొలి రెండుస్థానాల్లో ఉన్నాయి. భారత్, దక్షిణాఫ్రికా జట్లు
ఒక్కో మ్యాచ్ గెలిచి మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లు ఒక విజయం, ఒక ఓటమితో రెండు
పాయింట్లు సాధించి ఐదు, ఆరు స్థానాలకు పరిమితం అయ్యాయి. ఆస్ట్రేలియా, ఆప్ఘనిస్తాన్
ఆడిన ఒక్క మ్యాచ్ ఓడిపోయి.. ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నాయి. శ్రీలంక, ఆప్ఘనిస్తాన్,
నెదర్లాండ్స్ చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్