మెరుపుదాడికి దిగిన హమాస్ తీవ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు ముమ్మరం చేసింది.బుధవారం ఉదయం హమాస్ చీఫ్ హమ్మద్ దీఫ్ తండ్రి ఇంటిపై ఇజ్రాయెల్ సైన్యం బాంబుల వర్షం కురిపించింది.గాజాలో దాగిన హమాస్ తీవ్రవాదులను మట్టుబెట్టేందుకు 200 లక్ష్యాలపై ఇవాళ ఇజ్రాయెల్ బాంబు దాడులకు దిగింది. గాజాలో ఉన్న హమాస్‌కు చెందిన 450 స్థావరాలపై బాంబు దాడులు చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది.
గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకరదాడులు కొనసాగిస్తోంది. మూడో రోజు 200 లక్ష్యాలపై బాంబు దాడులు చేసింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఐదో రోజుకు చేరడంతో మృతుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది.
ఇజ్రాయెల్ ఇప్పటికే 4500 రాకెట్ దాడులతో గాజాపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో 770 మంది పాలస్తీనా పౌరులు చనిపోయారు. మరో 4500 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మృతుల్లో 140 మంది చిన్నారులు, 120 మంది మహిళలు ఉన్నారని గాజా ఆరోగ్యశాఖ ప్రతినిధి వెల్లడించారు.