హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన
మ్యాచ్‌లో శ్రీలంకపై పాకిస్తాన్ సునాయాస విజయం సాధించింది. 345 పరుగుల లక్ష్యాన్ని
కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి, 48.2 ఓవర్లలోనే సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు
నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 344 పరుగులు సాధించింది. మొదటి ఓవర్లోనే
కుశల్ పెరీరా డకౌట్‌తో లంక ఇన్నింగ్స్ మొదలైంది. పాక్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో
పటిష్టంగా బౌలింగ్ చేసారు. అయితే నిశాంక (51), కుశాల్ మెండిస్ (122) చక్కటి ప్రతిభ
కనబరిచారు. నిశాంక ఔటయ్యాక వచ్చిన సమరవిక్రమ, 108 పరుగులతో విక్రమాన్ని చాటాడు. కుశాల్
మెండిస్, సమరవిక్రమ జోరు అలాగే కొనసాగితే లంక 400 పరుగులు సాధించడం ఖాయమని
భావించారు. అయితే మెండిస్ ఔట్ అయ్యాక లంక జోరు తగ్గింది. సమరవిక్రమ నిలకడగా
ఆడుతున్నా మరోవైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతూ వచ్చాయి. శ్రీలంక తన చివరి 10
ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 61 పరుగులు మాత్రమే చేయగలిగింది.
345 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన
పాకిస్తాన్, తొలి రెండు వికెట్లను త్వరగానే కోల్పోయింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (12),
కెప్టెన్ బాబర్ ఆజామ్ (10) వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టారు. ఓపెనర్ షఫీక్, తర్వాత
వచ్చిన రిజ్వాన్ మాత్రం ఆటను నిలబెట్టేసారు. ఏ దశలోనూ వారిని నియంత్రించడం లంక
బౌలర్ల వశం కాలేదు. ఫీల్డింగ్‌లోనూ లంకేయులు చేతులు ఎత్తేసారు. షఫీక్ 113 పరుగులు
చేసి ఔట్ అయ్యాడు. రిజ్వాన్ 131 పరుగులు చేసి నాటౌట్‌గా చివరివరకూ క్రీజ్‌లో ఉన్నాడు.
షకీల్ 31పరుగులు, ఇఫ్తికార్ 22 పరుగులతో అండగా నిలిచారు.
వరల్డ్ కప్ టోర్నీలో ఇప్పటివరకూ ఇదే
అతిపెద్ద లక్ష్యఛేదన కావడం విశేషం. ఈ సీరీస్‌లో హైదరాబాద్‌లో ఇదే ఆఖరు మ్యాచ్
కావడంతో సుమారు 25వేల మంది అభిమానులు గ్రౌండ్‌కు వచ్చి ఆట చూసారు.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్