నవీ
ముంబైలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి సహకారం అందిస్తామని సింఘానియా గ్రూప్ ప్రకటించింది.
స్థానిక అన్నమయ్య భవనంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి, రేమండ్ గ్రూప్
చైర్మన్, ఎండీ గౌతమ్హరి సింఘానియా సమక్షంలో ఒప్పందం జరిగింది.
ముంబైలోని
ఉల్వే ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల భూమిలో రూ. 70 కోట్లతో
శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్నిసింఘానియా చేపడతారని ఈవో చెప్పారు. ఏడాదిలోపు
నిర్మాణం పూర్తవుతుందన్నారు.
నవరాత్రి
బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవ సమయం మార్పు చేసేందుకు టీటీడీ ఆగమ సలహాదారుల
సూచనలు తీసుకున్నామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
సాయత్రం 6.15 నుంచి 6.30 సమయంలో సేవ నిర్వహించాలని యోచిస్తున్నామన్నారు. గ్యాలరీలో వేచి ఉండే
భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకోనున్నామని వివరించారు. అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా తిరుమలలో నిర్వహిస్తామని
చెప్పిన ఈవో.. 19 రాత్రి కీలక ఘట్టమైన గరుడ వాహన సేవ
నిర్వహిస్తామని, 20సాయంత్రం పుష్పక విమానం, అక్టోబరు 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం కార్యక్రమంతో నవరాత్రి
బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు.
దసరా సెలవులు
ఉన్న కారణంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం
ఉందని, రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
బ్రహ్మోత్సవాలు సందర్భంగా వీఐపీ బ్రేక్
దర్శనాలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నాదనీరాజనం వద్ద
మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.