ఆప్ నేతల ఇళ్లలో ఈడీ సోదాలు కొనసాగిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో నేత, ఢిల్లీ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ అమానతుల్లా ఖాన్ ఇంట్లో ఇవాళ ఈడీ సోదాలు చేపట్టింది. మంగళవారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ వక్ఫ్‌బోర్డు అక్రమ నియామకాల్లో తీవ్ర అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆ సంస్థ ఛైర్మన్ ఖాన్ ఇంట్లో ఈడీ కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే అమానతుల్లా ఖాన్‌పై ఏసీబీ, సీబీఐ రెండు కేసులు నమోదు చేశాయి. ఇప్పటి వరకు 32 మందిని విచారించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.ఆప్ నేతలకు మనీలాండరింగ్‌తో కూడా సంబంధాలున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. మనీలాండరింగ్ వ్యవహారంలోనే ఖాన్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ వక్ఫ్‌బోర్డులో అక్రమ నియామకాలకు పాల్పడ్డాడంటూ అమానతుల్లా ఖాన్‌ను గతంలో ఏసీబీ అరెస్ట్ చేసింది.