స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు వేసిన క్వాష్ పిటిషన్పై తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ఈ కేసులో చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే వాదనలు వినిపించగా, సీఐడి తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. రెండు రోజులపాటు ఇరువురి వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. 17ఎ సెక్షన్ గురించి వివిధ కేసుల్లో వచ్చిన తీర్పులను సాల్వే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. భోజన విరామం తరవాత విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ కేసులో సెక్షన్ 17ఎ కీలకంగా మారడంతో అది చంద్రబాబుకు వర్తిస్తుందా, లేదా అనే విషయం కేసును మలుపు తిప్పే అవకాశం ఉందని న్యాయ కోవిదులు భావిస్తున్నారు.