హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సోమవారం జరిగిన
మ్యాచ్‌లో న్యూజీలాండ్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో పసికూన నెదర్లాండ్స్‌ను
ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 99 పరుగుల తేడాతో డచ్ టీమ్‌పై ఘన
విజయం సాధించింది. న్యూజీలాండ్ 50 ఓవర్లలో 322 పరుగులు చేయగా, నెదర్లాండ్స్ జట్టు 46.3
ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్, ప్రారంభంలో
కొద్దిగా తడబడింది. మొదటి మూడు ఓవర్లలో ఒక్క పరుగూ చేయలేకపోయింది. తర్వాత కివీస్
ఓపెనర్లు పుంజుకుని 10 ఓవర్లు అయేసరికి 63 పరుగులు చేయగలిగారు. ఆ తర్వాత డచ్
బౌలర్లు మళ్ళీ విజృంభించారు. తర్వాత 10 ఓవర్లలో కేవలం 39 పరుగులే ఇచ్చి ఒక వికెట్
తీసారు. కివీస్ జట్టు 26 ఓవర్లకు ఒక
వికెట్ నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. తర్వాత వెంటవెంటనే 5
వికెట్లు పడడంతో న్యూజీలాండ్ జట్టు దూకుడు తగ్గినట్టనిపించింది. అయితే ఇన్చార్జ్
కెప్టెన్ లాదమ్, శాంట్నర్ చెలరేగి ఆడారు. టెయిల్ ఓవర్స్‌లో ప్రతిభ కనబరిచారు.
దాంతో న్యూజీలాండ్ జట్టు 322 పరుగులతో ఇన్నింగ్స్ ముగించింది.
లక్ష్యఛేదనలో
నెదర్లాండ్స్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. కివీస్ బౌలర్ మిషెల్ శాంట్నర్ 59
పరుగులిచ్చి 5 వికెట్లు తీయడంతో న్యూజీలాండ్ పని సులభమైంది. ఆకర్‌మ్యాన్ ఒక్కడే 69
పరుగులు చేసి డచ్ టీమ్ పరువు కాపాడాడు. ప్రారంభం నుంచే డచ్ జట్టు ఆత్మరక్షణలో
పడిపోయింది, శాంట్నర్ బౌలింగ్‌కు విలవిలలాడిపోయింది. మరోవైపు ఆకర్‌మ్యాన్ ఒక్కడే
కుదురుగా ఆట ఆడగలిగాడు. రెండో వైపు నుంచి ఆటగాళ్ళు పేకముక్కల్లా ఎగిరిపోయారు. 25 ఓవర్లు
ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 114 పరుగులతో నిలిచింది. తర్వాత మళ్ళీ బౌలింగ్‌కు
వచ్చిన శాంట్నర్ డచ్ టీమ్ వెన్ను విరిచాడు. వరుస ఓవర్లలో మూడు వికెట్లు తీసాడు.
మొత్తానికి నెదర్లాండ్స్ జట్టు 46.3 ఓవర్లలో 223 పరుగులకే వెనుదిరిగింది.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్