ఇజ్రాయెల్ హమాస్ తీవ్రవాదుల మధ్య జరుగుతోన్న యుద్ధ భయాల నుంచి స్టాక్ మార్కెట్లు బయట పడ్డాయి. నిన్న అమెరికా, యూరప్ మార్కెట్లు సానుకూలంగా స్పందించడంతో, ఇవాళ దేశీయ మార్కెట్లు కూడా లాభాల్లో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 266 పాయింట్ల లాభంతో 65778 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 76 పాయింట్లు లాభపడి 19589 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.23 దగ్గర మొదలైంది.
సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, మారుతీ, భారతీ ఎయిర్టెల్,అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐటీసీ, ఎన్టీపీసీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. టీసీఎస్, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. నిన్న అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో మొదలైనా, చివరకు లాభాలతో ముగియడం దేశీయ స్టాక్ మార్కెట్లకు సానుకూలంగా మారింది.