బాలీవుడ్
హీరో షారుఖ్ ఖాన్ భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. ఆయన
ప్రాణాలకు ముప్పు ఉందని నిఘా సంస్థలు హెచ్చరించడంతో భద్రతను Y+ కేటగిరీకి పెంచారు. ఇకపై షారుఖ్ ఖాన్ ఎక్కడికి వెళ్ళినా సాయుధులైన
ఆరుగురు కమాండోలు రక్షణగా ఉంటారు.
దేశంలో పర్యటించిన సందర్భాలతో పాటు ఆయన నివాసంలో
కూడా ఇదే భద్రత కొనసాగుతుంది. నివాసం వద్ద నలుగురు సాయుధులు అన్ని వేళలా కాపలా
ఉంటారు. భద్రతా సిబ్బంది MP-5 మెషిన్ గన్లు, AK 47 అసాల్ట్ రైఫిల్స్ సహా గ్లోక్ పిస్టల్స్
ను కలిగి ఉంటారు.
ఈ
రక్షణ పొందేందుకు తగిన రుసుము చెల్లించాలి లేదా సెక్యూరిటీ మొత్తాన్ని డిపాజిట్
చేయాల్సి ఉంటుంది.
షారుఖ్
నటించిన జవాన్ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అంతకు ముందు విడుదలైన పఠాన్ కూడా
బ్లాక్ బాస్టర్ లిస్ట్ లో చోటు దక్కిచ్చుకుంది.
దీంతో ఒకే ఏడాదిలో రెండు సినిమాల ద్వారా రెండు వేల కోట్లు వసూలు చేసిన
సినిమాలు అందించిన హీరోగా కింగ్ ఖాన్ రికార్డు నెలకొల్పారు. అప్పటి నుంచి షారుఖ్ కు బెదిరింపు ఫోన్ కాల్స్
వస్తున్నాయి. చంపేస్తా మంటూ బెదిరిస్తున్నారు. ఈ విషయమై ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో
భద్రత పెంచారు.
ప్రస్తుతం డుంకీ అనే సినిమాలో ఆయన
నటిస్తున్నారు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22న
విడుదల కానుంది.