అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆంధ్రప్రదేశ్
సీఐడీ మరో ఐదుగురి పేర్లను కొత్తగా నిందితులుగా చేర్చింది. మాజీ మంత్రి నారాయణ
భార్య రమాదేవితో పాటు నారాయణ కళాశాల ఉద్యోగి ధనంజయ్ భార్య ప్రమీల, నారాయణ
బంధువు ఆవుల మణి శంకర్, రమాదేవి బంధువు రాపూరి సాంబశివరావు, కొత్తాపు
వరుణ్ కుమార్ పేర్లను కేసులో చేర్చాలని ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ మెమో దాఖలు
చేసింది.
ఇదే స్కాంలో చంద్రబాబు నాయుడు ఏ1గా,
మాజీ మంత్రి పి.నారాయణ ఏ2గా,
చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఏ14గా
ఉన్నారు. తాజాగా.. నారాయణ భార్య రమాదేవిని ఏ15గా,
రావూరి సాంబశివరావు ఏ-16, ఏ-17గా
ఆవుల మణిశంకర్, ఏ-18గా
ప్రమీల, వరుణ్‌కుమార్ కొత్తాపును ఏ19గా
చేర్చింది.
ఈ కేసుకు సంబంధించి నారా లోకేష్‌కు, నారాయణకు తమ ఎదుట హాజరు
కావాలని సీఐడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్
కోసం ఏ1 చంద్రబాబు పిటిషన్ వేయగా.. ఏపీ హైకోర్టు ఇవాళ ఆ
పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది.