తిరుమల
తిరుపతి దేవస్థానం పారిశుద్ధ్య కార్మికుల జీతాలను రూ. 12 వేల నుంచి రూ. 17 వేలకు
పెంచుతున్నట్లు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఐదు వేల మంది
పారిశుద్ధ్య కార్మికులకు ఈ జీతాల పెంపు వర్తిస్తుందన్నారు.
తిరుమలలోని అన్నమయ్య
భవన్లో నిర్వహించిన పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ భూమన్
కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని కార్పొరేషన్ లో
విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల జీతాలను
ప్రతీ ఏడాది మూడు శాతం పెంచేలా నిర్ణయం తీసుకోవడంతో పాటు కార్పొరేషన్ లో పనిచేసే
ఉద్యోగులు ఆకాల మరణం పొందితే వారికి నెలకు రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా
చెల్లించాలనే నిర్ణయానికి పాలకమండలి ఆమోదం తెలిపిందన్నారు.
నారాయణగిరిలో
హోటల్స్, అన్నమయ్య భవన్ లో హోటల్స్ ను పర్యాటక శాఖకు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. నారాయణగిరి ఉద్యానవనంలో కంపార్టుమెంట్ల ఏర్పాటుకు రూ. 18
కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.
ఆకాశ గంగ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు రూ. 40
కోట్ల వ్యయంతో నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం, వరాహస్వామి అతిథి గృహం నుంచి ఔటర్
రింగ్ రోడ్డు వరకు రూ. 10.8 కోట్లతో నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం చేయాలనే ప్రతిపాదనకు పాలకమండలి ఆమోదం తెలిపినట్లు
చెప్పారు.
చెర్లోపల్లి నుంచి శ్రీనివాస
మంగాపురం వరకు రూ. 25 కోట్లతో నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం, అలిపిరి వద్ద నిత్యం
శ్రీనివాాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించాలని పాలకమండలి నిర్ణయం
తీసుకుందన్నారు.