కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఐదు రాష్ట్రాల
శాసనసభలకు ఎన్నికల షెడ్యూలు ప్రకటించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీలో
తన సహచరులు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కలిసి మీడియా సమావేశంలో ఆ వివరాలు
వెల్లడించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3నే వెలువడతాయి.
మిజోరం:
అసెంబ్లీ స్థానాలు: 40
ఓటర్ల సంఖ్య: 8.52 లక్షలు
పోలింగ్ తేదీ: 07-11-2023
ఛత్తీస్‌గఢ్:
అసెంబ్లీ స్థానాలు: 90
ఓటర్ల సంఖ్య: 2.03 కోట్లు
పోలింగ్ తేదీలు: 07-11-2023, 17-11-2023
మధ్యప్రదేశ్:
అసెంబ్లీ స్థానాలు: 230
ఓటర్ల సంఖ్య: 5.6 కోట్లు
పోలింగ్ తేదీ: 17-11-2023
రాజస్థాన్:
అసెంబ్లీ స్థానాలు: 200
ఓటర్ల సంఖ్య: 5.25 కోట్లు
పోలింగ్ తేదీ: 23-11-2023
తెలంగాణ:
అసెంబ్లీ స్థానాలు: 119
ఓటర్ల సంఖ్య: 3.17 కోట్లు
పోలింగ్ తేదీ: 30-11-2023
ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 60 లక్షల మంది
మొదటిసారి ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.