హమాస్
మిలిటెంట్లపై ప్రతీకార దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ బలగాలు, ఉగ్రవాదులు నక్కిన
ప్రధాన స్థావరాలను నేలమట్టం చేశాయి. ఉగ్రవాదుల ముఖ్యనేత మొహమ్మద్ కస్తా సహా ఇతర
ముష్కరులు దాక్కున్న భవనాలతో పాటు వారికి నిధులు సమకూర్చే బ్యాంకు, ఇతర ఆపరేషన్ల
కోసం వినియోగించే కార్యాలయాలపై దాడులు చేసి కూల్చివేసింది.జబిలాయా ప్రాంతంలోని ఓ
మసీదు కేంద్రంగా ఇజ్రాయెల్ పై విధ్వంసాలకు పాల్పడుతున్నారని గుర్తించిన వైమానిక
దళం, దానిని ధ్వంసం చేసింది.
దక్షిణ,
మధ్య ఇజ్రాయెల్ లోని పట్టణాలపై శనివారం, హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో విరుచుకుపడి
విధ్వంసం సృష్టించారు. నిమిషాల వ్యవధిలో వేలకొలదీ రాకెట్లు ప్రయోగించి భయభ్రాంతులు
సృష్టించారు.
హమాస్ మారణహోమంలో ఇప్పటివరకు మరణించిన ఇజ్రాయెలీల పౌరుల సంఖ్య 700
దాటింది. పోలీసులు, సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. పలువురు ఇజ్రాయెలీలను
బంధించిన గాజా కు తరలించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతీకార
చర్యల్లో భాగంగా ఇజ్రాయెల్ వైమానిక దళం, అత్యంత శక్తివంతమైన, ప్రమాదకరమైన దాడులు
చేస్తోంది. హమాస్ మిలిటెంట్ల కార్యకలాపాలకు నిలయమైన గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్
యుద్ధ విమానాలు నిరంతరాయంగా దాడులు చేస్తున్నాయి. ఉగ్రవాదుల చర్యలను ప్రతిఘటించటంతో పాటు వారి మూలాలను తుడిచిపెట్టేలా
ఇజ్రాయెల్ సైన్యం పనిచేస్తోంది.