విజయవాడ కనకదుర్గ గుడి ఈవో నియామకం వివాదాలకు తావిస్తోంది. రెండు వారాల్లోనే ఇద్దరు ఈవోలను మార్చడం వివాదానికి దారితీసింది. ముందుగా దుర్గగుడి ఈవోగా చేస్తోన్న భ్రమరాంబను తప్పించి, డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఎం.శ్రీనివాస్‌ను నియమిస్తూ సీఎస్ ఆదేశాలిచ్చారు.వైద్యఆరోగ్యశాఖలో పనిచేస్తోన్న ఎం.శ్రీనివాస్‌ను రిలీవ్ చేయకపోవడంతో ఆయన ఈవోగా బాధ్యతలు చేపట్టలేదు.
రెండు వారాలు గడుస్తున్నా శ్రీనివాస్ జాయిన్ కాకపోవడంతో, ప్రభుత్వం హుటాహుటిన శ్రీకాళహస్తి ఈవో కెఎస్.రామారావును విజయవాడ దుర్గగుడికి బదిలీ చేశారు. వెంటనే జాయిన్ కావాలంటూ ఉత్తర్వులివ్వడంతో ఆయన ఇవాళ బాధ్యలు చేపట్టనున్నారు. శ్రీకాళహస్తి దేవాలయం ఈవో పదవి నుంచి రిలీవ్ చేయడంతో రామారావు ఇవాళ దుర్గగుడి ఈవోగా బాధ్యతలు తీసుకోనున్నారు. రెండేళ్లపాటు రామారావు దుర్గగుడి ఈవోగా పనిచేయనున్నారు.