టీడీపీ
అధినేత చంద్రబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు
బెయిల్ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. మూడు వేరు వేరు కేసుల్లో చంద్రబాబు పెట్టుకున్న
మూడు బెయిల్ పిటిషన్లనూ హైకోర్టు తిరస్కరించింది.
ఫైబర్
నెట్ కేసు విచారణ కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వలేమని చెప్పిన న్యాయస్థానం
మిగతా రెండు పిటిషన్లలో డీమ్డ్ కస్టడీగా పరిగణించడం లేనందున బెయిల్ ఇవ్వలేమనంటూ
అంగళ్ళు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది.
టీడీపీ
ప్రభుత్వం అమరావతి రింగు రోడ్డు అలైన్ మెంట్ మార్చి, పారిశ్రామికవేత్త లింగమనేని
రమేశ్ కు మేలు చేసి ఆయన నుంచి చంద్రబాబు లబ్ధి
పొందారనే అనే ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కూడా
చంద్రబాబును సీఐడీ కస్టడీకి కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో
చంద్రబాబు ముందస్తు బెయిల్ దాఖలు చేయగా హైకోర్టు కొట్టివేసింది.
ఇన్నర్ రింగు రోడ్డు, అంగళ్ళు అల్లర్ల కేసులో చంద్రబాబు A1గా ఉండగా, ఫైబర్ గ్రిడ్ కేసులో A25గా ఉన్నారు.