అధికారాన్ని
నిలబెట్టుకునేందుకు పాలక వైసీపీ కసరత్తు ముమ్మరం చేసింది. ఎన్నికల క్షేత్రంలో
అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెట్టడంతో పాటు కార్యకర్తలను సంసిద్ధం చేస్తోంది. మరోసారి
ఘనవిజయం సాధించడమే లక్ష్యగా శ్రేణులకు దిశానిర్దేశం చేస్తోంది.
ప్రచార
పర్వానికి అంకురార్పణగా విజయవాడ మున్సిపల్ స్టేడియంలో భారీ స్థాయిలో విస్తృతస్థాయి
సమావేశం ప్రారంభమైంది.
ఎంపీలు,
ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జ్ లు, ప్రాంతీయ సమన్వయకర్తలు,
జిల్లా పార్టీ అధ్యక్షుల నుంచి జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మండల పార్టీ
అధ్యక్షులు దాదాపు 8 వేల మంది ఈ సమావేశానికి హాజరయ్యారు.
తమ
పాలనలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్ళి వివరించి లబ్ధి
పొందాలని అధిష్టానం చెబుతోంది. రాష్ట్రం
అభివృద్ధిలో దూసుకెళ్ళాలంటే మళ్ళీ వైసీపీ నే అధికారంలోకి రావాలని ప్రజలకు
వివరించాలని సూచిస్తున్నారు .
సమావేశం
సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
ముందుగా పాసులు
జారీ చేసిన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు.
కార్యకర్తల
కోసం పసందైన భోజనాన్ని అందిస్తున్నారు. చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ,
చికెన్ 65, పీతల పులుసు, అపోలో ఫిష్, బొమ్మిడాయిల పులుసు, కోడిగుడ్డు వేపుడు, రొయ్యల
కూర, బ్రెడ్ హల్వా, పెరుగు చట్నీ, వీటితోపాటు వెజ్ కూరలు వండించారు. 100కు పైగా
భోజన కౌంటర్లు ఏర్పాటు చేశారు.