ఇజ్రాయెల్ హమాస్ మధ్య నెలకొన్న యుద్ధం స్టాక్ మార్కెట్లను కుదేలు చేసింది. ఇజ్రాయెల్‌పై హమాస్ తీవ్రవాదులు రాకెట్ దాడులతో విరుచుకుపడటంతో దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ ప్రారంభంలోనే 493 పాయింట్లు నష్టపోయి 65501 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 156 పాయింట్ల నష్టంతో 19497 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.83.23 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎస్బీఐ, టాటా స్టీల్, ఎన్టీపీసీ, జెఎస్డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, టైటన్, ఆల్ట్రాటెక్ సిమెంట్స్ షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆసియా పసిఫిక్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.