వన్డే వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో ఆసీస్‌పై నెగ్గి భారత్ శుభారంభం చేసింది. చెన్నై వేదికగా ఆసీస్‌తో జరిగిన వన్డేలో తొలుత భారత ఆటగాళ్లు తడబడ్డా, చివరకు విజయం సాధించారు. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 49.3 ఓవర్లలో 199 పరుగు చేసి ఆలౌట్ అయింది. 200 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన భారత ఆటగాళ్లు మొదట తడబడ్డారు. తరవాత తడాఖా చూపి వన్డేలో విజయం సాధించారు.
భారత్ జట్టులో కేఎల్ రాహుల్ 115 బంతుల్లో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లి 116 బంతుల్లో 85 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. ఇద్దరూ ధాటిగా ఆడటంతో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ జట్టులో హేజిల్‌వుడ్ 38 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.భారత జట్టులో జడేజా, కుల్దీప్ యాదవ్, బుమ్రా ధాటికి ఆసీస్ 49.3 ఓవర్లకే ఆలౌటైంది. ఆసీస్ జట్టులో స్టీవ్ స్మిత్ 46, వార్నర్ 41 పరుగులు చేశారు. బుధవారం ఢిల్లీ వేదికగా భారత జట్టు ఆష్ఘనిస్థాన్తో తలపడనుంది.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్