వన్డే
ప్రపంచ కప్ -2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా
జట్ల మధ్య పోరు జరుగుతోంది. టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో కంగారూ ఆటగాళ్ళు తడబడ్డారు. 200
పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచారు.
తొలి
ఓవర్ ను బుమ్రా కట్టుదిట్టంగా వేశాడు. కేవలం ఒక్క పరుగే ఇచ్చాడు. రెండో ఓవర్
సిరాజ్ వేయగా తొలి బంతికే నాలుగు పరుగులు వచ్చాయి. తర్వాతి నాలుగు బంతులూ డాట్ గా
మిగిలాయి. రెండు ఓవర్లకు స్కోరు 5/0గా ఉంది. మూడో ఓవర్ రెండో బంతికి మిచెల్ మార్ష్
డకౌట్ అయ్యాడు. బుమ్రా వేసిన రెండో బాల్ కు కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ
తర్వాత 17వ ఓవర్లో జట్టు స్కోర్ 74 పరుగులు ఉన్నప్పుడు డేవిడ్ వార్నర్ 41 పరుగుల
వద్ద ఔట్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
ఆ
తర్వాత 28వ ఓవర్లో జట్టు స్కోర్ 110 దగ్గర స్టీవెన్ స్మిత్ 46 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఆసీస్
స్కోర్ 110/3 ఉన్నప్పుడు 30వ ఓవర్లో లబుషేన్, అలెక్స్ క్యారీలను జడేజా పెవిలియన్‌కు
పంపాడు. దాంతో ఆస్ట్రేలియా 30 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 119 పరుగులు మాత్రమే
చేయగల్గింది.
35 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 138 పరుగులు
చేసింది. కుల్దీప్ వేసిన 35 ఓవర్ ఐదో బంతికి మ్యాక్స్‌వెల్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 37వ ఓవర్ లో ఆసీస్ మరో వికెట్ కోల్పోయింది.
కామెరూన్ గ్రీన్‌ను 8 పరుగుల వద్ద అశ్విన్ ఔట్ చేశాడు. దీంతో 37 ఓవర్లకు ఆసీస్ 7
వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే చేయగల్గింది.
బుమ్రా వేసిన 43వ ఓవర్ లో
రెండో బంతికి భారీ షాట్ ఆడిన కమిన్స్, లాంగాన్ శ్రేయస్ అయ్యర్ కు దొరికాడు దీంతో
కంగారూ జట్టు 8 వికెట్ ను కోల్పోయింది. హార్దిక్ వేసిన 48.2 ఓవర్ కు
జంపా ఆరు పరుగులకే ఔటయ్యాడు. 49.3 ఓవర్లకు
199 పరుగులు చేసి ఆస్ట్రేలియా ఆలౌటైంది.
భారత
స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అనారోగ్యంతో ఆటకు దూరంగా కాగా అతని స్థానంలో ఇషాన్
కిషన్ జట్టులోకి వచ్చాడు. భారత ఇన్నింగ్స్ ను రోహిత్ కిషన్ ప్రారంభించే అవకాశం
ఉంది.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్