పెనుకొండ
ఎమ్మెల్యే, మాజీమంత్రి శంకరనారాయణపై హత్యాయత్నం జరిగింది. గడప గడపకు కార్యక్రమంలో
పాల్గొనేందుకు గోరంట్ల మండలం గడ్డం తాండాకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే కాన్వాయ్
వెళుతున్న సమయంలో ఓ వ్యక్తి అడ్డుపడి డిటోనేటర్ విసిరాడు. అది గురి తప్పి పొలాల్లో
పడింది.
వెంటనే
అప్రమత్తమైన పోలీసులు డిటోనేటర్ ను విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఎమ్మెల్యే శంకరనారాయణ లక్ష్యంగా ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ డిటోనేటర్ విసిరినట్లు
ప్రాథమిక దర్యాప్తులో తేలిందని గోరంట్ల సీఐ సుబ్బరాయుడు తెలిపారు. దుండగుడు మద్యం
మత్తులో డిటోనేటర్ విసిరినట్లు భావిస్తున్నామన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి పేరు
గణేశ్ గా గుర్తించామని, అతనిది సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామమని తెలిపారు.
ఘటనపై మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.