ఇజ్రాయెల్
పై హమాస్ తీవ్రవాదులు దాడికి పాల్పడిన ఘటనతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. పరస్పర దాడులతో ఇజ్రాయెల్ దద్దరిల్లుతోంది. దీంతో ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా
కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి టెల్ అవివ్‌కు అక్టోబర్14 వరకు సర్వీసులు
నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణీకులు, సిబ్బంది భద్రతే లక్ష్యంగా ఈ
నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.
ఇజ్రాయెల్
పై హమాస్ ఉగ్రసంస్థ దాడులకు తెగబడటంతో ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి.
పలువురు ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వంద మంది ఇజ్రాయెల్ పౌరులు,
సైనికులను హమాస్ మిలిటెంట్లు అపహరించినట్లు టెల్ అవీవ్ తెలిపింది. ఇరువర్గాలకు
చెందిన 600 మంది చనిపోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ప్రస్తుత
పరిస్థితుల్లో తమ సర్వీసులు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు పూర్తి అండగా నిలుస్తామని
ఎయిర్ ఇండియా పేర్కొంది. దిల్లీ నుంచి టెల్ అవివ్‌కు వారానికి ఐదు సర్వీసులు నడుపుతోంది.
సోమ, మంగళ, గురు, శని, ఆదివారాల్లో
సర్వీసులు నడుపుతున్నారు.
శనివారం
కూడా టెల్ అవివ్‌కు సర్వీసు రద్దు
చేసింది.
హమాస్
మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య పరస్పర దాడులు పెద్ద ఎత్తున
జరుగుతున్నాయి. దక్షిణ ఇజ్రాయెల్ తో పాటు
గాజాలో నాలుగువందల మంది మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం
వెల్లడించింది.