విజయవాడ దుర్గగుడి ఈవోగా కెఎస్ రామారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాళహస్తి దేవాలయ ఈవోగా చేస్తోన్న రామారావును, దుర్గ గుడికి బదిలీ చేశారు. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
దసరా ఉత్సవ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్న వేళ దుర్గ గుడి ఈవో భ్రమరాంబను మారుస్తూ ప్రభుత్వం అక్టోబరు 1వ తేదీన నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే డిప్యూటీ కలెక్టర్ ర్యాంకు అధికారి ఎం.శ్రీనివాస్‌ను నియమించారు. అయితే ఆయన నేటికీ విధుల్లో చేరలేదు. దీంతో ప్రభుత్వం తాజాగా కెఎస్. రామారావును నియమించడంతోపాటు, వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.