ఇజ్రాయెల్-
పాలస్తీనాల వివాదం వందేళ్ళ నుంచి రగులుతూనే ఉంది. మొదటి ప్రపంచ యుద్ధ సమయం నుంచి ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.
మధ్య
ఆసియాలో మధ్యధరా సముద్రం, జోర్డన్ నది మధ్యన ఉండే ప్రాంతం పాలస్తీనా. యూదు,
క్రైస్తవ మతాలకు ఈ ప్రాంతం పుట్టినిల్లు. తమ పూర్వీకుల భూమి అని యూదులంటే, తమ
మాతృభూమి అంటూ అరబ్బులు వాదిస్తున్నారు.
1914కు ముందు ఈ ప్రాంతం ఒటోమాన్ సామ్రాజ్యం
పరిధిలో ఉండేది. . మొదటి ప్రపంచయుద్ధంలో ఒటోమాన్ ఓడిపోవడంతో బ్రిటన్ పాలనలోకి వెళ్ళింది.
అప్పటికే
ఈ ప్రాంతంలో యూదులు మైనార్టీలు,
అరబ్బులు అధిక సంఖ్యలో ఉండేవారు. యూదులు పాలస్తీనాను తమ పుట్టినల్లుగా
భావించేవారు. అరబ్బులు దానిని వ్యతిరేకించేవారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు
ప్రారంభమయ్యాయి.
లీగ్ ఆఫ్ నేషన్స్ తరఫున 1920 నుంచి 1948 వరకు పాలస్తీనా బ్రిటన్
ఏలుబడిలో ఉంది.
రెండో
ప్రపంచ యుద్ధ సమయంలో ఐరోపాలో యూదులపై దాడులు పెరగడంతో వారంతా పాలస్తీనాకు వలస
వచ్చి ఆశ్రయం పొందారు.
పాలస్తీనాను
యూదు, అరబ్ దేశాలుగా విభజించాలని 1947లో ఐక్యరాజ్యసమి నిర్ణయించింది. జెరుసలేంను
అంతర్జాతీయ పట్టణంగా తటస్థంగా ఉంచాలని ప్రతిపాదించారు. దీనిని అరబ్బులు
వ్యతిరేకించడంతో కార్యరూపం దాల్చలేదు.
యూదు
నేతలు ఇజ్రాయెల్ పేరుతో 1948లో తమ దేశాన్ని ప్రకటించుకున్నారు. పాలస్తినీయులు
దీనికి అభ్యంతరం తెలపడంతో యుద్ధం జరిగింది. వేలమంది పాలస్తీనియులు పారిపోయారు.
ఏడాది తర్వాత కాల్పుల విరమణ జరిగే సమయానికి పాలస్తీనాలో చాలా భాగం ఇజ్రాయెల్ పాలనలోకి
వెళ్ళింది.
వెస్ట్బ్యాంకుగాగా
పిలిచే ప్రాంతాన్ని జోర్డాన్, గాజా ప్రాంతాన్ని ఈజిప్టు తమ ఆధీనంలోకి
తెచ్చుకున్నాయి. జెరుసలేంలో పశ్చిమ భాగం ఇజ్రాయెల్ కు తూర్పు భాగం జోర్డాన్
చేతుల్లోకి పోయింది.
1967లో
తూర్పు జెరుసలేం, వెస్ట్బ్యాంకుతో పాటు సిరియన్ గోలన్ హైట్స్, గాజా, సినాయ్
ద్వీపకల్పాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. పాలస్తీనా శరణార్ధులు గాజా, వెస్ట్
బ్యాంకులతో పాటు జోర్డాన్, సిరియా, లెబనాన్ లో ఉంటున్నారు.
పాలస్తీనీయులు
ఎక్కువగా నివసించే తూర్పు జెరుసలేం, గాజా, వెస్ట్బ్యాంకు ప్రాంతాల్లో ఇజ్రాయెల్
లో పదేపదే ఘర్షణలు జరుగుతున్నాయి.
గాజా ప్రస్తుతం పాలస్తీనాకు చెందిన సాయుధ సంస్థ
హమాస్ ఆధీనంలో ఉంది.
1987లో
ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవిమెంట్ హమాస్ సంస్థ ఏర్పడింది. మతాధికారి షేక్ అహ్మద్
యాసిన్ స్థాపించిన హమాస్, రాజకీయ పార్టీ నుంచి సాయుధ సంస్థగా మారింది.
2006 లో పాలస్తీనాలో జరిగిన ఎన్నికల్లో హమాస్
అత్యథిక స్థానాలు గెలుచుకోవడంతో ఇజ్రాయెల్, అమెరికా.. పాలస్తీనియులకు ఆర్థిక సాయం
నిలిపివేశారు. ప్రస్తుతం ఈ సంస్థే ఇజ్రాయెల్ పై రాకట్లె దాడికి దిగి విధ్వంసం సృష్టిస్తోంది.