వన్డే
ప్రపంచకప్ టోర్నీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. చెన్నై
చిదంబరం స్టేడియం వేదికగా మధ్యాహ్నం మ్యాచ్ ప్రారంభం కానుంది. రౌండ్ రాబిన్ లీగ్
పద్ధతిలో జరుగుతున్న ప్రపంచకప్ కావడంతో ప్రతీ పోరు కీలకంగా మారింది. దీంతో ఈ
మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇరు జట్ల మధ్య ఇది 150వ వన్డే మ్యాచ్
కావడం విశేషం.
భారత
బ్యాటింగ్ విభాగంలో రోహిత్, ఇషాన్ కిషన్, కోహ్లీ, రాహుల్, శ్రేయాస్ రాణిస్తే భారత్
విజయం ఖాయం.
కెప్టెన్
రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో ప్రపంచ రికార్డు నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి.
అంతర్జాతీయ
క్రికెట్ లో అన్ని విభాగాల్లో ో కలిపి రోహిత్ శర్మ ఇప్పటివరకు 551 సిక్సులతో ఐసీసీ
జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్
553 సిక్సులు కొట్టారు. ఈ రోజు జరిగే మ్యాచ్ లో మరో మూడు సిక్సులు కొడితే,
ప్రపంచంలోనే అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా ఘనత సాధిస్తాడు.
12 ప్రపంచ కప్ టోర్నీల్లో భారత్, ఆస్ట్రేలియా
జట్లు ఇప్పటి వరకు 12 సార్లు తలపడ్డాయి. భారత్ 4 సార్లు గెలవగా ఆస్ట్రేలియా 8
సార్లు నెగ్గింది. చెన్నైలో ఈ రెండు జట్లు మూడు సార్లు పోటీపడగా భారత్ ఒకసారి
విజయం సాధించగా, ఆసీస్ రెండు సార్లు పైచేయి సాధించింది.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్