ఇజ్రాయెల్
పై పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రసంస్థ దాడి చేయడంతో ఇరు వర్గాలకు చెందిన 500 మంది
ప్రాణాలు కోల్పోయారు. సుధీర్ఘమైన యుద్ధానికి హమాస్ తీవ్రవాదులు కారణమయ్యారని
ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు హెచ్చరించారు.
తమ
దేశంపై హమాస్ రాకెట్ల తో దాడిచేయడాన్ని అత్యంత చీకటిరోజుగా పరిగణిస్తున్నామన్న
బెంజిమెన్ నెతన్యాహు, తమ రక్షణ దళాలు తీవ్రవాదులను తరిమేందుకు పోరాడుతున్నాయని తెలిపారు.
హమాస్ ను కూకటి వేళ్ళతో
పెకిలించి వైసేందుకు ఆర్మీ శక్తివంచన లేకుండా పోరాడుతోందన్నారు. దాడికి పాల్పడిన
వారిపై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు వారికి చేదు అనుభవాన్ని మిగులుస్తామన్నారు.
అత్యవసరంగా
సమావేశమైన యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్.. ఇజ్రాయెల్ కు తాము పూర్తి
సహకారం అందిస్తామని ప్రకటించారు. అలాగే ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఏకమయ్యే సంస్థలు,
పార్టీలకు హెచ్చరికలు జారీ చేశారు.
పాలస్తీనాకు
చెందిన ఉగ్రసంస్థ హమాస్, శనివారం ఉదయం అత్యంత పాశవిక దాడికి పాల్పడింది.
అకస్మాత్తుగా 5 వేల రాకెట్లతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. గాజా సరిహద్దు ప్రాంతం
నుంచి సమీపంలోని ఇజ్రాయెల్ పట్టణాలు, మిలటరీ పోస్టులపై దాడులకు తెగబడ్డారు. ఆపరేషన్ ‘ఆల్ ఆక్సా ఫ్లడ్’ పేరిట ఈ హింసాత్మక
ఘటనలకు పాల్పడింది. అరబ్, ఇస్లామిక్
దేశాలు కూడా ఈ యుద్ధంలో భాగస్వాములు కావాలని హమాస్ కోరింది. తాము విజయం అంచున
ఉన్నామంటూ హమాస్ చీఫ్ హనియెహ్ చెప్పారు.
ఇజ్రాయెలీలు
బందీలుగా ఉన్న చిత్రాలతో పాటు రాకెట్ల దాడితో చెల్లాచెదురైన పట్టణాల ఫొటోలను హమాస్
విడుదల చేసింది.
హమాస్ పై ప్రతీకార చర్యలో భాగంగా ఇజ్రాయెల్
దళాలు ధీటుగా బదులిస్తున్నాయి. ఆఫరేషన్ ఐరన్ స్వార్డ్స్ గా తమ సైనిక చర్యకు
పేరుపెట్టిన ఇజ్రాయెల్, గాజా పై పెద్ద
ఎత్తున దాడులు చేస్తోంది.
ఇజ్రాయెల్ పై హమాస్ దాడి పట్ల ప్రధాని మోదీ
విచారం వ్యక్తం చేశారు. విపత్కర పరిస్థితుల్లో ఆ దేశానికి అండగా ఉంటామని
తెలిపారు. భారత్ స్పందనకు ఇజ్రాయెల్
ధన్యవాదాలు తెలిపింది.