అఫ్గానిస్థాన్ దేశాన్ని భూకంపం వణికించింది. శనివారం మధ్యాహ్నం వరుసగా ఏడుసార్లు భూమి కంపించింది. తీవ్ర భూకంపంలో ఇప్పటి వరకు 2000 మంది
చనిపోయినట్టు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది. దాదాపు 1500 మంది గాయపడినట్టు తెలుస్తోంది.రిక్టర్ స్కేలుపై 6.3 నమోదు కావడంతో వేలాది ఇళ్లు నేల మట్టం అయ్యాయి. భూకంప కేంద్రం హెరాత్ పట్టణానికి వాయువ్య దిశలో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు గుర్తించారు.
తీవ్ర భూకంపం తరవాత కూడా ప్రకంపనలు కొనసాగాయి. తరవాత వచ్చిన ప్రకంపనలు 5.5గా నమోదయ్యాయి. హెరాత్ పట్టణం ఇరాన్ సరిహద్దులకు సమీపంలో ఉంది. గత ఏడాది కూడా అఫ్గానిస్థాన్ తూర్పు ప్రాంతంలో పెను భూకంపం సంభవించింది. ఆ భూకంపంలో 1000 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.
మన పొరుగు దేశం నేపాల్‌లోనూ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. శనివారం మధ్యాహ్నం నేపాల్‌లో రెండుసార్లు ప్రకంపనలు వచ్చాయని ఆ దేశం ప్రకటించింది. అయితే అక్కడ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.