భారతదేశంలో జరుగుతున్న క్రికెట్ ప్రపంచకప్
టోర్నమెంట్లో బంగ్లాదేశ్ ఖాతా తెరిచింది. పసికూన ఆప్ఘనిస్తాన్‌పై సునాయాస విజయం
సాధించింది.
వరల్డ్ కప్‌లో మూడో మ్యాచ్ బంగ్లాదేశ్,
ఆప్ఘనిస్తాన్ మధ్య హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరిగింది. టాస్ గెలిచిన
బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్తాన్ ఆట బాగానే
మొదలుపెట్టింది. కానీ 15 ఓవర్ల తర్వాత నుంచీ ఆ జట్టు వరసగా వికెట్లు కోల్పోయింది.
ఆప్ఘనిస్తాన్ బ్యాట్స్‌మెన్‌లో రహ్మనుల్లా గుర్బాజ్ అత్యధికంగా 47 పరుగులు చేసాడు.
ఇబ్రహీం జాద్రాన్ 22, అజ్మతుల్లా 22, రహమత్ షా 18, హష్మతుల్లా షాహిది 18 పరుగులు
చేసారు. రషీద్ ఖాన్, నబీ విఫలమవడం ఆప్ఘన్ జట్టును దెబ్బ తీసింది. ఆప్ఘన్ జట్టు 37.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌట్
అయింది.
ఈ స్వల్ప లక్ష్యాన్ని
బంగ్లాదేశ్ సునాయాసంగానే ఛేదించింది. కేవలం 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
ఓపెనర్లు తాజిద్ హసన్, లిట్టన్ దాస్ విఫలమయ్యారు. కానీ తర్వాత వచ్చిన మెహదీ హసన్
మిరాజ్ (57), నజ్మల్ హుసేన్ శాంటో (59) పరుగులతో నిలకడగా ఆడి హాఫ్ సెంచరీలు
చేసారు. షకీబ్ అల్ హసన్ 14 పరుగులు చేసాడు. 34.4 ఓవర్లలో 158 పరుగులు చేసి,
బంగ్లాదేశ్ ప్రపంచకప్‌లో ఖాతా తెరిచింది.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్