కృష్ణా
జలాల్లో న్యాయమైన వాటా కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని జలవనరుల శాఖ మంత్రి
అంబటి రాంబాబు తెలిపారు. కృష్ణా జలాల పునఃపంపిణీని నిలిపివేయలని ప్రధాని మోదీకి
సీఎం జగన్ లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేసిన అంబటి రాంబాబు.. రాష్ట్రానికి
నష్టం జరిగే విధానాన్ని తమ ప్రభుత్వం అంగీకరించే ప్రసక్తే లేదన్నారు.
ఏపీకి
రావాల్సిన ప్రతీ నీటి బొట్టునూ తీసుకుంటామన్నారు.
ఇప్పటికే
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నీటిపంపకాలకు
సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు ‘టరమ్స్ ఆఫ్ రిఫెరెన్స్’ను
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో నిర్దేశించగా..
కొత్త టరమ్స్ ఆఫ్ రిఫెరెన్స్ ఇవ్వడాన్నిఅంగీకరించేది లేదన్నారు. రైతులకు
అన్యాయం జరగకుండా పోరాడతామని చెప్పారు.
బచావత్
ట్రిబ్యునల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ నీటి వాటా 512 టీఎంసీలు డిమాండ్
చేస్తున్నామన్నారు. బచావత్ కమిషన్ ట్రిబ్యునల్ 1976లో నిర్ణయించిన నీటివాటాల
ప్రకారమే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు దక్కాలన్నారు.
జనసేన
అధినేత పవన్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను ఉద్దేశించి మంత్రి
అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్ళిద్దరూ పొలిటికల్ బఫూన్లు అంటూ విమర్శించారు.
ఎప్పుడు ఏం మాట్లాడతారో వాళ్ళకే అర్థం కావడం
లేదని, వాళ్ళ ప్రకటనలకు ఆ రెండు పార్టీల కార్యకర్తలు జట్టు పీక్కుంటున్నారని
సెటైర్లు వేశారు.
ఎన్డీయేలో నుంచి చాలా కష్టపడి బయటకొచ్చి తెలుగుదేశానికి మద్దతిచ్చానన్న
పవన్‌కళ్యాణ్ మళ్లీ వెంటనే మాటమార్చేసి.. తాను ఎన్డీయేలోనే ఉన్నానంటాడని
దెప్పిపొడిచారు.
2014
ఎన్నికల్లో టీడీపీ మిత్రపక్షంగా ఉండి అధికారంలోకి తెచ్చి ఆ ప్రభుత్వంలో
భాగస్వామిగా ఉన్న పవన్‌కళ్యాణ్ కూడా చంద్రబాబు అవినీతిలో తనదైన వాటా తీసుకునే
ఉంటాడు కదా అని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే, చంద్రబాబు దొంగగా మారడంలో పవన్‌కళ్యాణ్ పాత్ర కూడా ఉండే ఉంటుందన్నారు.
టీడీపీతో పొత్తు ఎవరికీ ఇష్టం లేకపోవడంతో జనసేన పూర్తిగా బలహీనపడిందని పవన్
తెలుసుకోవాలని సూచించారు. ఇరుపార్టీల అధినేతలు ఇష్టపడి పొత్తు పెట్టుకున్నప్పటికీ
కేడర్ మాత్రం వారి నిర్ణయాన్ని అంగీకరించడం లేదన్నారు.