ఇజ్రాయెల్
లో మరోసారి అలజడి రేగింది. ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి.
ఉదయం గాజా నుంచి ఇజ్రాయెల్ పై రాకెట్లతో దాడికి పాల్పడ్డారు. పాలస్తీనాకు చెందిన
హమాస్ మిలిటెంట్లు చొరబాటుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ సైన్యం
ప్రతిదాడికి దిగింది. దాడులు కారణంగా పలువురు సామాన్యులు ప్రాణాలు కోల్పోయినట్లు
తెలుస్తోంది.
గాజా,
గ్రేటర్ టెల్ అవీవ్ ప్రాంతం నుంచి పేలుళ్ళ శబ్ధం వినిపించడంతో ఇజ్రాయెల్ సైన్యం
అప్రమత్తమై అత్యవసర పరిస్థితిని విధించింది.
దేశ దక్షిణ, మధ్య ప్రాంతాల్లో ఫైర్ సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం
చేసిన ఇజ్రాయెల్, పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు తమ భూభాగంలో చొరబడ్డారని ప్రకటించింది.
నివాసాల నుంచి ు ఎవరూ బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేసింది.
ఇజ్రాయెల్
పై కొత్త సైనిక చర్య ప్రారంభమైనట్లు హమాస్ గ్రూప్ నేత మహమ్మద్ డీఫ్ ప్రకటించారు. ఆపరేషన్ అల్- అక్సా పేరుతో ఇజ్రాయెల్
పై 5 వేల రాకెట్లు ప్రయోగించినట్లు మహమ్మద్ డీఫ్ తెలిపారు.
ఇజ్రాయెల్
కూడా ప్రతిదాడులు చేస్తోంది. మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్లు కూల్చేందుకు యాంటీ
రాకెట్ డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేసింది.
గాజా
స్ట్రిప్ లో స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ ఆర్మీ వాహనాలు, పారాచ్యూట్లతో హమాస్
ఉగ్రవాదులు ఇజ్రాయెల్ లో చొరబడ్డారు. సరిహద్దులోని ఓ పోలీస్ స్టేషన్ ను స్వాధీనం చేసుకున్నారు.
1967లో
అరబ్-ఇజ్రాయెల్ యుద్ధంలో తూర్పు జెరూసలెం, గాజా ప్రాంతాలను ఇజ్రాయెల్ సైన్యం
స్వాధీనం చేసుకుంది. స్వతంత్ర పాలస్తీనాలో ఆ రెండు ప్రాంతాలు అంతర్భాగం కావాలనే
డిమాండ్ తో పాలస్తీనా తిరుగుబాటు చేస్తోంది.