ఆసియా
క్రీడల విజేతలకు ప్రధాని మోదీ ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఆసియా క్రీడల్లో మన క్రీడాకారులు
తొలిసారిగా వందకు పైగా పతకాలు సాధించడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. దేశం గర్వపడేలా
విజయాలు సాధించారని ప్రశంసించారు. ఆసియా క్రీడలు ముగిసిన అనంతరం అక్టోబర్ 10న
ఆతిథ్యం ఇవ్వనున్నట్లు స్వయంగా ప్రధానమంత్రే వెల్లడించారు.
‘‘ఆసియా
క్రీడల్లో మన క్రీడాకారుల ప్రదర్శన అద్భుతం, పతకాల సంఖ్య 100 కు చేరడంతో
దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. మన అథ్లెట్లకు నా హృదయ పూర్వక అభినందనలు.
10వ తేదీన ఆసియా క్రీడల బృందానికి ఆతిథ్యం ఇవ్వడానికి, మన అథ్లెట్లతో సంభాషించడానికి
ఎదురుచూస్తున్నా’’ అని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు.
19వ
ఆసియా క్రీడల్లో మన దేశం సాధించిన 100 పతకాల్లో 25 గోల్డ్ మెడల్స్ ఉండగా, 35 రజతాలు, 40
కాంస్యాలు ఉన్నాయి. పతకాల జాబితాలో భారత్
నాలుగో స్థానంలో ఉంది.
మహిళల కబడ్డీ విభాగంలో చైనీస్ తైపీపై భారత్ ఘన విజయం
సాధించడంతో భారత్, పతకాల్లో సెంచరీ మార్క్ ను చేరుకుంది. 2018
ఆసియా క్రీడల్లో మన దేశం 70 పతకాలు సాధించగా, ప్రస్తుతం 100 మెడల్స్ సాధించి కొత్త
చరిత్ర సృష్టించింది.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్