‘ఇస్ బార్ సౌ పార్’ – ‘ఈసారి వందకు పైనే’ అనే
నినాదంతో ఆసియన్ క్రీడల ప్రయాణం ప్రారంభించిన భారతదేశం తన లక్ష్యాన్ని సాధించింది.
భారత క్రీడాచరిత్రలో మొదటిసారి ఆసియన్ గేమ్స్‌లో వంద పతకాలు సాధించింది.
చైనాలోని హాంగ్జౌ నగరంలో జరుగుతున్న 19వ ఆసియా
క్రీడల్లో భారతదేశం రికార్డు సృష్టించింది. దేశ క్రీడాచరిత్రలోనే తొలిసారిగా వంద
పతకాలు గెలిచింది. రేపటితో ముగిసే ఆసియన్ గేమ్స్‌లో భారత్ పాల్గొనే పోటీలు నేటితో
ముగుస్తాయి. ఈ ఉదయం భారత జట్టు ఆర్చరీలో నాలుగు పతకాలు గెలిచి 99 మార్కుకు
చేరుకుంది.
చైనీస్ తైపీతో జరిగిన మహిళల కబడ్డీ ఫైనల్స్‌లో
విజయం ద్వారా భారత జట్టు స్వర్ణపతకం గెలుచుకుని వంద పతకాల మార్కును చేరుకుంది.
వీటిలో 25 స్వర్ణపతకాలు, 35 రజత పతకాలు, 40 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇవి కాక, ఇవాళ
భారత జట్టు పాల్గొనే మరికొన్ని క్రీడల్లో పతకాలు గెలవడం ఖాయం. అలా, నూటికి పైగా
పతకాలను సాధించే దిశగా భారత బృందం దూసుకుపోతోంది.
ఈసారి భారత బృందం కొన్ని అనూహ్యమైన పతకాలు
సాధించింది. వాటిలో ప్రధానమైనది మహిళల టేబుల్ టెన్నిస్‌లో సాధించిన కాంస్యపతకం.
సుతీర్థ ముఖర్జీ, ఐహిక ముఖర్జీ ద్వయం సెమీఫైనల్స్‌లో చైనాను ఓడించి కాంస్యం
గెలిచారు.
మహిళల 5వేల మీటర్ల పరుగుపందెంలో పారుల్ చౌదరి
విజయం కూడా చాలాకాలం గుర్తుండిపోతుంది. జపాన్‌కు చెందిన రిరికా హిరోనకాపై ఆఖరి
క్షణాల్లో చివరి 30మీటర్లలో ఆధిక్యం సాధించి, ఈ మీరట్ ముత్యం ఉత్కంఠభరిత విజయాన్ని
సొంతం చేసుకుంది. భారత జట్టుకు స్వర్ణాన్ని తెచ్చిపెట్టింది.
జావెలెన్ త్రో ఈవెంట్లో కిషోర్ కుమార్ జెనా
అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఒకదశలో నీరజ్ చోప్రాను సైతం ఓడిస్తాడా అన్నంతగా
రాణించాడు. అయితే ప్రపంచ చాంపియన్ నీరజ్ చోప్రా తన ఆధిక్యాన్ని కాపాడుకున్నాడు.
నీరజ్ చోప్రా స్వర్ణ పతకం గెలవగా, కిషోర్ కుమార్ జెనా రజత పతకాన్ని కూడా భారత్
ఖాతాలో చేర్చాడు.
కనోయింగ్లోనూ భారత
క్రీడాకారులు ఈసారి తమ ముద్ర వేసారు. పురుషుల వెయ్యి మీటర్ల డబుల్స్ ఈవెంట్లో అర్జున్
సింగ్, సునీల్ సింగ్ సలామ్ కాంస్యపతకం సాధించారు. 35 కిలోమీటర్ల రేస్ వాక్ మిక్స్డ్
ఈవెంట్లో రాంబాబు, మంజురాణిల జోడీ అద్భుతమైన ప్రతిభ కనబరిచి, కాంస్యపతకం సాధించారు.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్