ఆసియా క్రీడల్లో వందకంటె
ఎక్కువ పతకాలు సాధించాలన్న భారత్ లక్ష్యం సాకారం కానుంది. మనదేశం ఇప్పటికే 95
పతకాలు గెలిచింది.
ఇప్పటికి భారతదేశం 22 స్వర్ణపతకాలు, 34
రజత పతకాలు, 39 కాంస్యపతకాలు… మొత్తం 95 పతకాలు గెలుచుకుంది. కనీసం మరో 6 పతకాలు
గెలవడం ఖాయమైంది. అయితే అవి ఏ పతకాలు అన్నది మాత్రం నిర్ధారణ కావలసి ఉంది.
ఇక ఈరోజు 13వ రోజు భారత ఆటగాళ్ళ ప్రతిభను
పరికిద్దాం.
క్రికెట్లో సెమీఫైనల్ దశలో భారత జట్టు
బంగ్లాదేశ్‌పై విజయం సాధించి, ఫైనల్‌కి చేరుకుంది.
ఆర్చరీ మహిళల రికర్వ్ టీమ్ ఈవెంట్ సెమీఫైనల్లో
భారత జట్టు దక్షిణ కొరియా చేతిలో ఓడింది.
కబడ్డీ మహిళల సెమీఫైనల్స్‌లో భారత జట్టు
నేపాల్‌తో పోటీపడి విజయం సాధించింది. నేపాల్‌ను 61-17తేడాతో ఓడించింది.
సెపక్తక్రా పురుషుల ఈవెంట్లో భారత్,
మయన్మార్ జట్లు తలపడ్డాయి…
జు-జిత్సు మహిళల 52కేజీల ఈవెంట్లో భారత
క్రీడాకారిణి రోషిణి యూఏఈ క్రీడాకారిణి ఆస్మా చేతిలో ఓటమి చవిచూసింది. భారత్‌కు
చెందిన మరో క్రీడాకారిణి అనుపమా స్వయిన్ చైనీస్ క్రీడాకారిణి జియె మియావోని ఓడించింది.
క్లైంబింగ్ పురుషుల ఈవెంట్లో భరత్
పెరీరా ఏడవ స్థానంలో నిలిచాడు.
కయాకింగ్ మహిళల సెమీఫైనల్లో శిఖా చౌహాన్
విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్ళింది.
రెజ్లింగ్ పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్
విభాగంలో దక్షిణ కొరియాకు చెందిన సుంగ్వాన్పై గెలిచిన అమన్, క్వార్టర్ ఫైనల్స్‌కు
అర్హత సాధించాడు.
జు-జిత్సు మహిళల 57కేజీల ఈవెంట్లో
దక్షిణ కొరియా, మంగోలియా క్రీడాకారిణుల చేతిలో భారత క్రీడాకారిణులు ఓటమి పాలయ్యారు.
రెజ్లింగ్ మహిళల 62 కేజీల విభాగంలో కాంబోడియా
క్రీడాకారిణిపై భారత్‌కు చెందిన సోనమ్ మాలిక్ 10-0 తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి
దూసుకెళ్ళింది.
రెజ్లింగ్ పురుషుల 65 కేజీల విభాగంలో
బజరంగ్ పూనియా ఫిలిప్పీన్స్ క్రీడాకారుడిపై 10-0 తేడాతో విజయం సాధించి క్వార్టర్
ఫైనల్స్‌కు అర్హత సాధించాడు.
ఆర్చరీలో మహిళల రికర్వ్ టీమ్ ఈవెంట్లో
భారత్, వియత్నాంపై గెలిచి కాంస్యపతకం గెలుచుకుంది.
వాలీబాల్‌లో భారత జట్టు మంగోలియాను 3-0
తేడాతో ఓడించింది.
రెజ్లింగ్ 57కేజీల పురుషుల ఫ్రీస్టైల్ విభాగంలో
భారత్‌కు చెందిన అమన్, ఇరానియన్ క్రీడాకారుడు ఇబ్రహీం ఖరి మీద విజయం సాధించి
సెమీస్‌కు అర్హత సాధించాడు.
రెజ్లింగ్ మహిళల 62 కేజీల ఈవెంట్లో
సోనమ్, 72 కేజీల ఈవెంట్లో కిరణ్ గెలిచి సెమీస్‌కు చేరుకున్నారు. అయితే వారిద్దరూ సెమీస్‌లో
ఓడిపోయారు.
బ్రిడ్జ్ పురుషుల టీమ్ ఈవెంట్ ఫైనల్లో
భారత జట్టు హాంకాంగ్ జట్టు చేతిలో ఓడి, రజతంతో సరిపెట్టుకుంది.
ఈక్వెస్ట్రియన్ జంపింగ్ వ్యక్తిగత విభాగంలో
భారతీయ క్రీడాకారుడు యష్ నెన్సే ఫైనల్స్‌కు చేరుకున్నాడు.
రెజ్లింగ్ పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్
ఈవెంట్లో బజరంగ్ పూనియా సెమీస్‌లో ఓటమి పాలయ్యాడు.
సాఫ్ట్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో
రాగశ్రీ కులందైవేలు వియత్నాం క్రీడాకారుడిపై విజయం సాధించాడు. అనికేత్ పటేల్
వియత్నాం క్రీడాకారుడిపైన, జయ్ మీనా తైపే క్రీడాకారుడిపైనా విజయం సాధించారు.
ఆర్చరీ పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్లో
భారత జట్టు ఫైనల్స్‌లో దక్షిణ కొరియా చేతిలో ఓడి, రజత పతకంతో సరిపెట్టుకుంది.
బ్యాడ్మింటన్ పురుషుల సెమీస్‌లో ప్రణయ్
చైనా క్రీడాకారుడి చేతిలో ఓడి, కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.
కబడ్డీ పురుషుల సెమీఫైనల్లో భారత జట్టు
పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.
సెపక్తక్రా మహిళల రెగు ఈవెంట్లో భారత్,
థాయ్‌లాండ్ చేతిలో ఓటమి పాలైనా, కాంస్యపతకం దక్కించుకుంది.
రెజ్లింగ్ మహిళల 62కేజీల ఫ్రీస్టైల్
ఈవెంట్లో భారత్‌కు చెందిన సోనమ్ కాంస్యపతకం గెలిచింది. 76 కేజీల ఈవెంట్లో కిరణ్
కూడా కాంస్యపతకం సాధించింది.
హాకీ పురుషుల ఈవెంట్లో
భారత్ జపాన్‌పై 5-1 స్కోరుతో విజయం సాధించి స్వర్ణం గెలుచుకోవడమే కాక, 2024 పారిస్
ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించింది.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్