వైసీపీ
పాలన దారుణంగా ఉందని బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని అన్నారు. మద్యం,
గంజాయి మత్తులో యువత చిత్తువుతోందని ఆందోళన వ్యక్తం చేసిన యామిని, మహిళల పుస్తెలు
తెగడానికి, యువత పెడదోవ పట్టడానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలే
కారణమన్నారు.
మహిళలు, బాలికలపై దారుణాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో బాలికలకు సరైన వసతులు
కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
కేంద్రం
కేటాయించిన నిధులు ఎక్కడ ఖర్చు చేశారో తెలుపుతూ శ్వేతపత్రం విడుదల చేయాలని
డిమాండ్ చేశారు.
జల్ జీవన్ మిషన్ ద్వారా
కేంద్రం ఏపీకి కోట్ల రూపాయల నిధులు
అందజేసినా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదన్నారు. దీంతో అనేక చోట్ల పనులు
నిలిచిపోయాయని చెప్పారు.
ప్రభుత్వాన్ని
ప్రశ్నిస్తే మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని మండిపడిన సాదినేని యామిని,
పదేళ్ళుగా రాజకీయాల్లో ఈ తరహా విష సంస్కృతి పెరిగిందన్నారు. ఇటువంటి చర్యలను బీజేపీ
వ్యతిరేకిస్తోందన్నారు.