న్యూస్‌క్లిక్ పోర్టల్‌కు విదేశాల నుంచి అక్రమ మార్గంలో నిధులు అందాయా? భారత సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించే కుట్ర జరిగిందా? అసలు న్యూస్‌క్లిక్‌పై పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఏముంది అనే విషయాలు ఆసక్తిగా మారాయి.
న్యూస్‌క్లిక్ పోర్టల్‌లోకి విదేశాల నుంచి అక్రమంగా నిధులు వచ్చాయంటూ 2021లోనే ఈడీ కేసులు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. గత వారం న్యూస్‌క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పురకాయస్థ, ఆ సంస్థ మానవ వనరుల విభాగం అధిపతి అమిత్ చక్రవర్తితోపాటు పలువురు విలేకరులు, పౌర సమాజ కార్యకర్తల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. వీరంతా భారతదేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతీసేలా, దేశంలో అసంతృప్తిని రగిలించేలా ప్రయత్నిస్తున్నారని, ఇది దేశ భద్రతకు ముప్పు తెచ్చేలా ఉందని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.
విదేశీ సంస్థల ద్వారా దేశానికి హాని చేసే విధంగా అక్రమంగా 2018 ఏప్రిల్ నుంచి న్యూస్‌క్లిక్ పోర్టల్‌లోకి కోట్ల రూపాయల నిధులు వచ్చాయని ఈడీ కేసులో పేర్కొంది.
చైనా ప్రభుత్వ మీడియాతో సన్నిహిత సంబంధాలు కలిగిన అమెరికన్ కుబేరుడు నెవిల్లే రాయ్ సింఘమ్ ద్వారా న్యూస్‌క్లిక్ పోర్టల్‌లోకి విదేశాల నుంచి అక్రమంగా నిధులు వచ్చాయని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.
చైనా అనుకూల ప్రచారానికి మద్దతు పలికే ఆర్థిక నెట్‌వర్క్‌కు సింఘమ్ సంబంధాలు కలిగి ఉన్నాడని న్యూయార్క్ టైమ్స్ తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం అతను చైనాలోని షాంఘైలో నివాసం ఉంటున్నట్టు టైమ్స్ నివేదిక ద్వారా తెలుస్తోంది.
న్యూస్‌క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్ పురకాయస్థ, మరికొందరు దేశ ఐక్యత, ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసేలా వ్వవహరిస్తున్నారని, 2020-21 ఢిల్లీలో రైతుల నిరసనల ప్రచారం వెనుక కూడా న్యూస్‌క్లిక్ పోర్టల్ సిబ్బంది హస్త ముందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్ వివాదాస్పద భూభాగాలంటూ కుట్ర పన్నినట్లు కేసు రిపోర్టులో తెలిపారు.కోవిడ్-19 అదుపు చేయడంలో భారత ప్రభుత్వ ప్రయత్నాలను కించపరిచేలా తప్పుడు కథనాలు ప్రచురించారు. ఉగ్రవాద నిరోధక చట్టం (UAPA)లోని పలు సెక్షన్ల కింద అరెస్టైన న్యూస్‌క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్ పురకాయస్థ, చక్రవర్తి ఎఫ్‌ఐఆర్ కాపీలు పొందడానికి ఢిల్లీ కోర్టు గురువారం అంగీకరించింది.వారి అభ్యర్థనను ఢిల్లీ పోలీసులు వ్యతిరేకించారు. ఇప్పటికే వారి అరెస్టుకు ఆధారాలు అందించామని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు.
విదేశాల నుంచి అక్రమ మార్గాల ద్వారా న్యూస్‌క్లిక్ పోర్టల్‌కు రూ.38 కోట్ల నిధులు అందాయనే కేసులో ఇద్దరు కీలక వ్యక్తులను మంగళవారం అరెస్టు చేయగా, వందలాది మంది విలేకరులను ప్రశ్నించి వదిలేశారు. న్యూస్‌క్లిక్‌కు అక్రమ మార్గాల్లో అందిన నిధులను సామాజిక కార్యకర్తలు తీస్తా సెతల్వాద్, గౌతమ్ నవ్లాఖాతో పంచుకున్నట్లు ఎఫ్ఐఆర్‌లో పొందుపరిచారు.