స్కిల్
డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత
చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటీషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు
ముగిశాయి. తీర్పును న్యాయమూర్తి రిజర్వులో పెట్టారు. అక్టోబర్ 9న తీర్పు చెబుతామని జడ్జి
ప్రకటించారు.
సుప్రీంకోర్టులో
చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కూడా సోమవారం విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో
సుప్రీంకోర్టు తీర్పును బట్టి ఏసీబీ కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశముందని
న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. పీటీ వారెంట్ల పిటిషన్లను కూడా ఏసీబీ కోర్టు
సోమవారం విచారించనుంది.
సీఐడీ
తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించగా, చంద్రబాబు తరఫున
ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు.
స్కిల్
డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు సెక్షన్ 409 వర్తిస్తుందని, ఆయన కుట్ర పూరిత
నేరానికి పాల్పడ్డారని సీఐడీ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు
తెలిపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ ఖాతాకు నిధులు మళ్ళించారన్నారు. రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు విచారణకు
సహకరించలేదని, మరో మూడ్రోజులపాటు సీఐడీ కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు.
తెలుగుదేశం
ఖాతాలో జమ అయిన మొత్తం ఆ పార్టీకి వచ్చిన విరాళాలు అని వాటితో చంద్రబాబుకు సంబంధం
లేదని దూబే వాదించారు. ఇవి స్కిల్ స్కాం నుంచే వచ్చాయని చెప్పేందుకు ఎలాంటి
ఆధారాలు లేవన్నారు. అరెస్టు చేసిన 15 రోజుల తర్వాత కస్టడీకి అడగడం సరికాదన్నారు.
స్కిల్ కేసులో అరెస్టైన 13 మందికి ఇప్పటికే న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేశాయని
చెప్పారు.