చైనా హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో
భారతదేశం సాధించిన పతకాల సంఖ్య 86కు చేరింది. గురువారం 12వ రోజు
ముగిసేనాటికి భారత్ సాధించిన పతకాల్లో 21 స్వర్ణపతకాలు కాగా 32 రజత పతకాలు, 33
కాంస్యపతకాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో స్థిరంగా కొనసాగుతోంది.
ఆసియా క్రీడల్లో ఇది భారత్ అత్యుత్తమ ప్రదర్శన. గతంలో జకార్తాలో జరిగిన 18వ ఆసియా
క్రీడల్లో భారత్ 70 పతకాలు సాధించింది.
ఆసియా కప్ క్రీడల 12వ రోజైన గురువారం భారతదేశం
ఆర్చరీ మెన్స్ కాంపౌండ్ విభాగంలో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణపతకం సాధించింది.
అంతకుముందు మహిళల ఆర్చరీ టీమ్ కాంపౌండ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ బృందం స్వర్ణం
సాధించింది. స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్‌లో దీపికా పల్లికల్, హరీందర్ పాల్ సింగ్
జంట మలేసియాపై గెలిచి స్వర్ణపతకం గెలిచింది. పురుషుల వ్యక్తిగత విభాగంలో సౌరవ్
ఘోసాల్ రజతపతకంతో సరిపెట్టుకున్నాడు.
ఈరోజు ఆర్చరీ రికర్వ్ టీమ్ ఈవెంట్స్‌లో నాకౌట్
ఫేజ్‌లో భారత మహిళల, పురుషుల జట్లు పాల్గొంటాయి. రెజ్లింగ్‌లో బజరంగ్ పునియా,
షటిల్ బ్యాడ్మింటన్‌లో హెచ్ఎస్ ప్రణయ్ తలపడతారు. బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్ సెమీస్‌లో
చిరాగ్ శెట్టి-సాత్విక్ సాయిరాజ్ జంట ఆడుతుంది. హాకీలో భారతదేశం జపాన్‌తో
స్వర్ణపతకం కోసం పోరాడుతుంది.
ఇవాళ భారత క్రికెట్ జట్టు సెమీఫైనల్ మ్యాచ్‌లో
బంగ్లాదేశ్‌పై విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్ళింది. మొదట బ్యాటింగ్ చేసిన
బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 96 పరుగులు మాత్రం చేసింది. భారత్
కేవలం ఒక్క వికెట్ కోల్పోయి 9.2 ఓవర్లలో 97 పరుగులు సాధించి గెలుపొందింది. తిలక్
వర్మ (55నాటౌట్), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (40నాటౌట్) ఆడుతూ పాడుతూ విజయం
సాధించారు. నేపాల్ మీద సెంచరీ కొట్టిన యశస్వి జైస్వాల్ ఈరోజు డకౌట్ అయ్యాడు. ఫైనల్
మ్యాచ్ శనివారం జరుగుతుంది. అందులో భారత్ గెలిచి స్వర్ణపతకం సాధించే అవకాశాలు
ఎక్కువగానే ఉన్నాయి.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్