హెల్మెట్
లో నాగుపాము దూరిన ఘటన కేరళలోని త్రిశూర్ లో చోటుచేసుకుంది. పుతూర్ లో నివాసముండే
పొంటెకాల్ సోజన్, తాను పనిచేసే చోట బైక్ ను పార్క్ చేసి, హెల్మెట్ ను దానికే
ఉంచారు.
సాయంత్రం
నాలుగు గంటల సమయంలో బైక్ దగ్గరకు వెళ్ళి హెల్మెట్ ను తీస్తుండగా, ఏదో
కదులుతున్నట్లు అనిపించి పరిశీలిస్తే పాము కనిపించింది. దీంతో భయపడి అక్కడి నుంచి
దూరంగా జరిగాడు. వెంటనే అటవీశాఖ అధికారులకు
సమాచారం అందించారు. ఓ వలంటీర్ అక్కడకు
వచ్చి పామును పట్టి అటవీ ప్రాంతంలో వదిలారు. నాగుపాము వయస్సు రెండు నెలలు ఉంటుందని
అంచనా వేశారు.