న్యూజీలాండ్
జట్టు వరల్డ్‌కప్ ఆరంభ మ్యాచ్‌లో అదరగొట్టింది. కీలక ఆటగాళ్ళు లేకపోయినా 283
పరుగుల ఛేదనను 88 బంతులు మిగిలి ఉండగానే ముగించింది. ప్రత్యర్థి జట్టు ఇంగ్లాండ్‌ను
చిత్తుగా ఓడించింది.
కెరీర్లో తొలి వరల్డ్‌కప్
ఆడుతున్న డెవాన్ కాన్వే, 121 బంతుల్లో 152 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నారు.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రచిన్ రవీంద్ర 96 బంతుల్లో 123 పరుగులు చేశారు. రెండో వికెట్‌కు
ఈ ఇద్దరు 273 పరుగులు చేశారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్ల తేడాతో ఓడింది.
ముందుగా
బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 282 పరుగులు
చేసింది. జోరూట్ 77 రన్స్ చేయగా, బట్లర్ 43 పరుగులు, బెయిర్ స్టో 33 పరుగులు
చేశారు.
ఆ
తర్వాత లక్ష్య ఛేదనలో భాగంగా కివీస్ జట్టు 36.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 283
పరుగులు చేసి భారీ విజయం సాధించింది.
తొలి
వరల్డ్ కప్ ఆడుతున్న న్యూజిలాండ్ ఆటగాడు 23 ఏళ్ళ రచిన్ రవీంద్ర తొలి మ్యాచ్ లోనే సత్తా చాటారు. అంతర్జాతీయ
క్రికెట్ లో కేవలం 13 వన్డేలు మాత్రమే ఆడిన రచిన్ రవీంద్ర, ఈ మ్యాచ్ లో ఓ రికార్డు
నెలకొల్పాడు.
ప్రపంచ
కప్ లో సెంచరీ చేసిన అత్యంత పిన్నవయస్కుడైన రచిన్ ఘనత సాధించారు. ఇతను భారతీయ
మూలాలున్న వ్యక్తి కావడం మరో విశేషం.
రవీంద్ర
తల్లిదండ్రులు భారతీయులే. ఆయన తండ్రిది బెంగళూరు. 1990లో న్యూజిలాండ్ కు వెళ్ళి
అక్కడ స్థిరపడ్డారు. రచిన్ అక్కడే జన్మించారు.
న్యూజిలాండ్
పౌరుడిగా పెరిగినప్పటికీ క్రికెట్ లో రాటు తేలింది మాత్రం రాయలసీమలోనే.
రచిన్ ప్రతీ
ఏడాదీ అనంతపురం వచ్చి అక్కడ ఉన్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ లో శిక్షణ పొందేవాడు.
రవీంద్ర తండ్రికి న్యూజీలాండ్ లో హాట్ కేక్స్ పేరుతో క్రికెట్ క్లబ్ ఉంది. దాని తరఫున ఇతర ప్లేయర్లతో కలిసి రవీంద్ర
క్రికెట్ టోర్నీలు ఆడేవారు. అలా మన తెలుగు
ప్రాంతంతో సంబంధం ఉంది.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్