వరల్డ్ కప్ మొదటి మ్యాచ్‌లో న్యూజీలాండ్ టాస్
గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఇంగ్లండ్
తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆట బాగానే మొదలుపెట్టినా, బ్యాట్స్‌మెన్ తడబాట్ల వల్ల
ఇంగ్లండ్ స్కోరును మూడువందలు దాటించలేకపోయింది. మొత్తం మీద ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్,
9 వికెట్ల నష్టానికి 282 పరుగులతో ఇన్నింగ్స్ ముగించారు.
ఓపెనర్లుగా వచ్చిన బెయిర్‌స్టో, మలాన్ మొదట్లో
దూకుడు ప్రదర్శించారు. అయితే మలాన్ 14 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అప్పటికి
ఇంగ్లండ్ స్కోరు 40 మాత్రమే. మరో 24 పరుగుల తర్వాత బెయిర్‌స్టో కూడా పెవిలియన్ బాట
పట్టాడు.
జో రూట్, హ్యారీ బ్రూక్ కాసేపు నిలకడగా ఆడారు. పికప్
అందుకుంటున్న దశలో హ్యారీ బ్రూక్ 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.
అప్పటికి ఇంగ్లండ్ 17 ఓవర్లలో 94 పరుగులు చేసింది. 22వ ఓవర్లో మొయిన్ అలీ క్లీన్
బౌల్డ్ అవడంతో ఇంగ్లండ్ జట్టు 118 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 30
ఓవర్లు పూర్తయేసరికి, జో రూట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
34వ ఓవర్లో జోస్ బట్లర్ 43 పరుగుల వ్యక్తిగత
స్కోరు వద్ద ఔట్ అయ్యాడు. దాంతో ఇంగ్లండ్ 188 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. తర్వాత
బ్యాటింగ్‌కు వచ్చిన లివింగ్స్టన్ 20 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు.
అప్పటికి 39వ ఓవర్ నడుస్తుండగా ఇంగ్లండ్ స్కోర్ 221కి చేరుకుంది. మొదటినుంచీ
నిలకడగా ఆడుతూన్న జో రూట్ మరికొద్దిసేపటికే 77 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర,
టీమ్ స్కోర్ 221 వద్ద, ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. 11 రన్స్ మాత్రమే తీసిన క్రిస్
వోక్స్ ఎనిమిదో వికెట్‌గా పెవిలియన్ చేరేసరికి ఇంగ్లండ్ 250 పరుగులు సాధించింది.
మరో రెండు పరుగులు
మాత్రమే జోడించి, తొమ్మిదో వికెట్‌గా శామ్ కర్రన్ ఔటయ్యాడు. ఆదిల్ రషీద్ 13
పరుగులు, మార్క్ వుడ్ 13 పరుగులతో జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ని 282 పరుగుల దగ్గర ముగించారు.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్