లండన్లోని భారత రాయబార కార్యాలయంపై గత మార్చి 19న జరిగిన దాడిలో పాల్గొన్నట్టు అనుమానిస్తోన్న ఖలిస్థాన్ ఉగ్రవాదిని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత మార్చి 19న లండన్లోని భారత రాయబార కార్యాలయం ముందు జరిగిన నిరసనలో పొల్గొన్న వ్యక్తిని బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. తరవాత బెయిల్పై విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు.
మోస్ట్ వాంటెడ్ ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తరవాత కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణపై బ్రిటన్ జోక్యం చేసుకోవాలంటూ కొందరు సోమవారం నాడు నిరసనకు దిగారు. నిరసన సమయంలో ఖలిస్థాన్ సానుభూతిపరుడిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
గత మార్చి 19న లండన్లోని భారత రాయబార కార్యాలయంపై దాడి చేసిన 12 మందిలో, తాజాగా అరెస్ట్ చేసిన వ్యక్తి ఒకరని అనుమానిస్తున్నారు. మార్చి 19న ఖలిస్థాన్ నిరసనకారులు భారత రాయబార కార్యాలయం భవనంపైకి ఎక్కి భారత జెండాను లాగే ప్రయత్నం చేశారు. అందుబాటులో ఉన్న వస్తువులను భవనం కిటికీలపైకి విసరడంతో ఓ అధికారి కూడా గాయపడ్డారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వ ఏజన్సీ ఎన్ఐఏ అనుమానితుల ఫోటోలను విడుదల చేసింది.
బ్రిటన్లోని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి, గ్లాస్గోలోని గురుద్వారాలో ప్రవేశించకుండా అడ్డుకోవడంలో కుట్ర కోణం లేదని స్కాట్లాండ్ పోలీసులు వెల్లడించారు.