మహిళా
సాధికారిత దిశగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం పలు సంస్కరణలు అమలు చేస్తోంది. మహిళల ఆర్థిక స్వాలంభన కోసం అనేక
సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న పాలక బీజేపీ, తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్
కల్పిస్తూ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అటవీశాఖ మినహా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది.
మధ్యప్రదేశ్
సివిల్ సర్వీసెస్ నిబంధనలు-1997కు ఈ మేరకు సవరణలు చేసింది.
సర్వీసు నిబంధనలు ఎలా
ఉన్నప్పటికీ రాష్ట్ర సర్వీసులో అటవీశాఖ
మినహా అన్ని పోస్టులకు 35 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని అని నోటిఫికేషన్ లో
పేర్కొన్నారు.
పోలీసు
శాఖతో పాటు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ఇటీవలే
ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. దానికి అనుగుణంగా రాష్ట్రప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేసింది.
మున్సిపాలిటీలు,
పంచాయతీల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేసిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ మొదటిది. పోలీసు శాఖలో ఇప్పటికే 30 శాతం రిజర్వేషన్ అమలు
చేస్తున్నారు. మహిళల పేరుపై ఆస్తిని రిజస్టర్ చేస్తే పన్నులో తగ్గింపు కూడా
ఇస్తున్నారు.
మధ్యప్రదేశ్
లో మొత్తం 5.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 2.72 కోట్ల మంది మహిళలు ఉన్నారు.