అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పెంపుడు కుక్క కమాండర్ ఇటీవల కాలంలో అనేక మంది భద్రతా సిబ్బందిని కరిచిన విషయం తెలిసిందే. వరుసగా 11వ సారి కరవడంతో బైడెన్ పెంపుడు కుక్కపై అనేక విమర్శలు వచ్చాయి. తాజాగా కమాండర్ శునకాన్ని వైట్ హౌస్ నుంచి తరలించినట్లు అధికారులు తెలిపారు.
వైట్ హౌస్ సిబ్బంది భద్రత విషయంలో అమెరికా అధ్యక్షుడు చాలా శ్రద్ధ తీసుకుంటారని జిల్ బైడెన్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఎలిజిబెత్ అలెగ్జాండర్ చెప్పారు. శునకం కమాండర్ విషయంలో వైట్ హౌస్ సిబ్బంది చాలా సహనం చూపించారని ఆయన అన్నారు. కమాండర్‌ను వైట్ హౌస్ క్యాంపస్ నుంచి తరలించినట్టు ఆయన వెల్లడించారు. అయితే ఈ కుక్కను ఎక్కడికి తరలిచారనే విషయం వెల్లడించలేదు.
సెప్టెంబరు 30 తరవాత వైట్ హౌస్‌లో కమాండర్ కనిపించలేదని తెలుస్తోంది. 2021లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ శునకాన్ని వైట్ హౌస్‌కు తీసుకువచ్చారు. ఇప్పటికే ఈ కుక్క 11 మంది సీక్రెట్ సర్వీస్ అధికారులను కరిచింది. వాస్తవానికి ఈ సంఖ్య చాలా ఎక్కవగానే ఉండవచ్చని తెలుస్తోంది.