సుమారు రెండునెలలపాటు కొనసాగే వరల్డ్
కప్ క్రికెట్ సమరం నేటినుంచి మొదలైంది. భారత్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీ మొదటి
మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది.
వరల్డ్ కప్‌లో మొదటి మ్యాచ్ ఇంగ్లండ్,
న్యూజీలాండ్ల మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజీలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. జానీ
బెయిర్‌స్టో, డేవిడ్ మలాన్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు.
న్యూజీలాండ్ జట్టులో కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్
ఆడడం లేదు. అతని బదులు టామ్ లతామ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈశ్ సోధీ, టిమ్
సౌదీ, లాకీ ఫెర్గూసన్ కూడా మొదటి మ్యాచ్ ఆడడం లేదు. ఇంగ్లండ్ టీమ్‌లో కూడా బెన్
స్టోక్స్, గస్ అట్కిన్సన్, రీస్ టోప్లే ఇవాళ్టి ఆటకు దూరంగా ఉన్నారు.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్