అమెరికాలో 16 మంది బాలురను లైంగికంగా వేధించిన కేసుల్లో మాథ్యూ జక్రజెవ్‌స్కీ అనే వ్యక్తికి 690 సంవత్సరాల జైలు శిక్ష ఖరారు కానుంది. ఇతను కోస్టా మెసా ప్రాంతంలో ఇళ్లల్లో పిల్లలను ఆడించే వాడిగా పనిచేశాడు. ఇతన్ని సిట్టర్ బడ్డీ అని కూడా పిలిచేవారు. 16 మంది బాలురను లైంగికంగా వేధించడం, అందులో ఒకరికి అశ్లీల చిత్రాలను చూపించిన కేసులో ఆరెంజ్ కౌంటీ డిస్ట్రిక్ట్ కోర్టు మాథ్యూను నిందితుడుగా తేల్చింది.
మాథ్యూ 34 నేరాల్లో దోషిగా తేలింది. 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారిపై అసభ్యంగా ప్రవర్తించాడని, పదేళ్ల కంటే తక్కువ వయసున్న బాలురతో నోటితో సంభోగించాడని నిర్థారణ అయింది. అతని వద్ద నుంచి పిల్లల అశ్లీల చిత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. లైంగిక చర్యల కోసం పిల్లలను ఉపయోగించి నీలి చిత్రాలు రికార్డు చేసినట్టు రుజువైంది.
ఇలాంటి మొత్తం 34 నేరాల్లో మాథ్యూను దోషిగా తేల్చారు. తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లిన సమయంలో, పార్టీలకు వెళ్లినప్పుడు పిల్లల ఆలనా పాలనా చూసేందుకు మాథ్యూను నియమించుకున్నారు. ఇంట్లో పెద్దలు లేని సమయంలో పిల్లలకు తోడుగా ఉంచడంతో మాథ్యూ ఈ దురాగతాలకు పాల్పడినట్టు తేలింది.
2014 నుంచి 2019 మధ్య కాలంలో మాథ్యూ ఈ లైంగిక దాడులకు పాల్పడ్డాడు. నేరాలు రుజువు కావడంతో నవంబర్ 17న సీ30లోని శాంటా అనాలోని సెంట్రల్ జస్టిస్ సెంటర్ శిక్షలను ప్రకటించనుంది. మాథ్యూ చేసిన నేరాలకు 690 సంవత్సరాల జైలు శిక్ష పడనుంది.