ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన ఒక్క పిలుపుతో
ఒకే ఒక్క రోజులో ఒకే ఒక్క దుకాణంలో ఖాదీ అమ్మకాలు రికార్డు సృష్టించాయి. ఈ గాంధీ
జయంతి నాడు ఢిల్లీ కన్నాట్ ప్లేస్‌లోని ఖాదీభవన్‌లో కోటీ 52లక్షల రూపాయల ఖాదీ
దుస్తులు అమ్ముడయ్యాయి.
ఖాదీ దుస్తుల అమ్మకాల రికార్డుపై ప్రధానమంత్రి
హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్ సోషల్ మీడియాలో ఇవాళ ట్వీట్ చేసారు. ‘‘దేశవ్యాప్తంగా
మన కుటుంబ సభ్యులు ఖాదీ కొనుగోళ్ళ ద్వారా సృష్టించిన రికార్డు చూస్తుంటే ప్రజల
సెంటిమెంట్‌కు ఖాదీ శక్తివంతమైన చిహ్నంగా నిలిచిందని అర్ధమవుతోంది. ఖాదీ పట్ల ఈ
ప్రేమ ప్రతీరోజూ కొనసాగాలనీ, కొత్త రికార్డులు సృష్టిస్తూ ఉండాలనీ
కోరుకుంటున్నాను. స్వయంసమృద్ధభారతాన్ని సాధించడానికి ఖాదీ కొత్త బలాన్ని
సమకూరుస్తుంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు.
‘‘ఈ యేడాది సెప్టెంబర్ 24నాటి మన్ కీ బాత్
కార్యక్రమంలో ప్రధాని మోదీ దేశ ప్రజలందరికీ గాంధీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని
ఖాదీ దుస్తులు కొనవలసిందిగా విజ్ఞప్తి
చేసారు. ఫలితంగా, ఢిల్లీ కన్నాట్‌ప్లేస్‌లోని ఖాదీభవన్‌లో ఒక్కరోజులో రూ.1.52కోట్ల
విలువైన ఖాదీ దుస్తులు అమ్ముడుపోయాయి’’ అని ఖాదీ ఇండియా సంస్థ ట్వీట్ చేసింది.
కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల
మంత్రిత్వశాఖ ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ప్రధానమంత్రి వినతికి
ఢిల్లీ ప్రజలు బాగా స్పందించారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల కొనుగోలులో
కొత్త రికార్డు సృష్టించారు. గాంధీ జయంతి రోజు ఢిల్లీ నడిబొడ్డున కన్నాట్‌ప్లేస్‌లో
ఉన్నఖాదీభవన్లో రూ.1,52,45,000 విక్రయాలు జరిగాయి. ఖాదీభవన్ చరిత్రలోనే ఇది
అత్యధిక విక్రయాల రికార్డు’’ అని ప్రకటించింది.
ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్ మనోజ్
కుమార్ మాట్లాడుతూ, గాంధీ జయంతి నాడు ఆయన వారసత్వమైన ఖాదీ విక్రయాలు ఇంత విజయవంతం
అవడానికి కారణం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘బ్రాండ్ పవర్’, దేశప్రజల్లో ఆయనకున్న
అపరిమితమైన ప్రజాదరణే కారణమని వ్యాఖ్యానించారు.
2022 అక్టోబర్ 2 నాడు ఒక్కరోజులోనే కన్నాట్‌ప్లేస్‌లోని
ఖాదీభవన్‌లో రూ.1,33,95,000 అమ్మకాలు జరిగాయి. ఈ యేడాది ఆ విక్రయాల స్థాయి మరింత
పెరిగింది. 2023 అక్టోబర్ 2 ఒక్కరోజే రూ. 1,52,45,000 విక్రయాలు జరిగాయి.
జి-20 సదస్సు సమయంలో జాతీయ చేనేత దినం సందర్భంలో ప్రధాని
మోదీ మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్ ప్రచారం కారణంగా గత
తొమ్మిదేళ్ళలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల విక్రయాలు రూ.1.34 లక్షల కోట్లు
దాటాయని వెల్లడించారు.