ఐదు
రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు అమలు చేస్తోంది. రాష్ట్రాల
వారీగా ప్రత్యేక కసరత్తు ప్రారంభించిన బీజేపీ అధిష్టానం, తెలంగాణలో పార్టీ పటిష్టత
కోసం 14 కమిటీలు వేసింది. జోన్ల వారీగా సంస్థాగత కార్యక్రమాలు నిర్వహించాలని
నిర్ణయించింది.
పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బహిరంగ సభలకు ప్రణాళిక
రచించిన కమలదళం ఆ దిశగా ముందుకు సాగుతోంది.
అందులో భాగంగా మనుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి
రాజగోపాల్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా ఆయనను నియమించింది. పబ్లిక్ మీటింగ్ కమిటీ ఇంఛార్జి బాధ్యతలను
బండి సంజయ్‌కు అప్పగించారు.
మేనిఫెస్టో,
పబ్లిసిటీ కమిటీల చైర్మన్ గా మాజీ ఎంపీ, V6 న్యూస్
ఛానల్ అధినేత గడ్డం వివేక్ వెంకటస్వామిని నియమించారు. ఛార్జ్‌షీట్ కమిటీ చైర్మన్
గా మురళీధర్ రావు ను పార్టీ ఎంపిక చేసింది.
నిరసనలు,
ఆందోళన నిర్వహణ కమిటీ చైర్మన్ గా విజయశాంతి, ప్రభావిత వ్యక్తులను కలిసే కమిటీ చైర్మన్ గా డీకే అరుణను నియమించారు.
ఎన్నికల కమిటీ చైర్మన్ గా మర్రి శశిధర్
రెడ్డి, సోషల్ మీడియా చైర్మన్ గా ధర్మపురి అరవింద్ కు బాధ్యతలు అప్పగించారు.
ఘట్
కేసర్ లోని వీబీఐటీ కాలేజీలో శుక్రవారం జరిగే కౌన్సిల్ సమావేశంలో పలు తీర్మానాలపై
చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఈ సమావేశానికి దాదాపు వెయ్యి మంది నేతలు
హాజరుకానున్నట్లు తెలుస్తోంది.