దిల్లీ
అల్లర్ల కేసులో కుట్రదారులుగా ఉన్న ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు
అరెస్టు చేశారు. వీరిలో పీహెచ్డీ
విద్యార్థి అర్షద్ ప్రమేయంపై కీలక ఆధారాలు దొరికాయి. దిల్లీ అల్లర్లకు కుట్రలో
కీలక సూత్రధారి అతనే అనే విషయం బట్టబయలు
అయింది.
CAA-NRC నిరసనల సమయంలో దాడులకు ప్రేరేపించడంలో
కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. దేశానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే నినాదాలు
సృష్టించినట్లు కూడా అతనిపై అభియోగాలు ఉన్నాయి. దీంతో పాటు షాహీన్‌బాగ్ నిరసన
శిబిరం ఏర్పాటులో కూడా ప్రముఖ పాత్ర పోషించినట్లు వెల్లడించారు.
జాతీయ
దర్యాప్తు సంస్థ, మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదుల జాబితాలో ఉన్న షెహనాజ్‌కు అర్షద్
ఆశ్రయం కల్పించాడని కూడా విచారణలో తేలింది.
పుణేలో
పోలీసు కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయిన షెహనాజ్ పై మూడు లక్షల రూపాయల
రివార్డు కూడా ఉంది.
అర్షద్
ను విచారించిన తర్వాతే దిల్లీ పోలీసులు షెహనాజ్ ను పట్టుకోగల్గారు.
గాంధీ
జయంతి రోజు దేశవ్యాప్తంగా అల్లర్లు, దాడులకు ప్రయత్నించగా పోలీసులు భగ్నం చేసి
ముగ్గురు తీవ్రవాదులను అరెస్టు చేశారు. ఐసిస్‌తో సంబంధాలు కొనసాగిస్తూ దేశవ్యాప్తంగా
దాడులకు ప్రణాళిక రచించారు. ః
జామియా యూనివర్సిటీలో అర్షద్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రకుట్రకు ప్రణాళిక రచించిన కేసులో అతడిని
అదుపులోకి తీసుకున్నారు. అతను 2016 నుంచి అతివాది గా ఉన్నాడని పోలీసు వర్గాలు
తెలిపాయి.
షెహనాజ్,
అర్షద్‌లు చాలా కాలంగా కలిసి పనిచేస్తున్నారని ఇద్దరూ కలిసి ఉగ్రదాడులకు ప్రణాళిక
రచించినట్లు తెలుస్తోంది.
పోలీసు
విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై, సూరత్, గాంధీనగర్ లో ప్రముఖులను
హతమార్చేందుకు రెక్కీ నిర్వహించినట్లు షెహనాజ్ ఆలమ్ అలియాస్ అబ్దుల్లా
ప్రయత్నించాడని తేలింది. ఐఈడీలతో దాడులకు పథక రచన చేసినట్లు వెల్లడైంది.
బాంబుల
తయారీ వినియోగించే పదార్థాలు, అతివాద సాహిత్యం అతడి నుంచి పోలీసులు స్వాధీనం
చేసుకున్నారు. అవి పాకిస్తాన్ నుంచి అందినట్లుగా నిర్ధారించారు.