ఆసియన్
గేమ్స్‌లో భారత ఆటగాళ్ళు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. వంద పతకాల సాధనే
లక్ష్యంగా పర్యటనకు వెళ్ళిన మన క్రీడాకారుల విజయయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. వంద
పతకాల గమ్యానికి చేరువగా వెళ్ళిన మన ఆటగాళ్ళు ఇప్పటికే 82 పతకాలు దేశం ఖాతాలో వేశారు.
ఉమెన్స్
కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో భారత్ స్వర్ణాన్ని నెగ్గింది.
మన రాష్ట్రానికి చెందని జ్యోతి సురేఖతో పాటు
అదితి స్వామి, పరిణీత్ కౌర్ ల జట్టు ప్రత్యర్థి చైనాను ఓడించి విజేతగా నిలిచింది.
ఫైనల్ లో 230-229తో విజయం సాధించింది.
50
కేజీల విభాగంలో రెజ్లర్ పూజ గెహ్లోత్ ఫైనల్ లోకి అడుగుపెట్టారు. మంగోలియాకు
చెందిన సాంట్-ఒచిరిన్ నమూన్సెత్సెగ్ ను
ఓడించి ఫైనల్ కు అర్హత సాధించారు. వెటరన్ స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ గోషల్ సింగిల్స్
విభాగంలో ఆద్భుతంగా రాణించి ఫైనల్ కు చేరుకున్నారు.
షట్లర్ పీవీ సింధూ మాత్రం
నిరాశ పరిచారు. చైనాకు చెందిన బింగిజావ్ హే చేతిలో క్వార్టర్స్ లో ఓడారు.
ఒలింపిక్
ఛాంపియన్ నీరజ్ చోప్రా వరుసగా రెండోసారి ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించారు.
అత్యుత్తమ ప్రదర్శనతో తొలి స్థానంలో నిలిచాడు.
మరో
భారత్ అథ్లెట్ కిశోర్ కుమార్ వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనతో రజత పతకాన్ని గెలిచాడు.
4×400 మీటర్ల రిలేలో భారత ఆటగాళ్ళు మెరిశారు.
పురుషులు గోల్డ్ మెడల్ సాధించగా, మహిళలు రజతం సొంతం చేసుకున్నారు.
హాకీలో
భారత పురుషుల జట్టు జోరు కొనసాగుతోంది. దూకుడు కొనసాగిస్తూ హర్మన్‌ప్రీత్ బృందం
పసిడి పోరుకు దూసుకెళ్ళింది.
పోటీల
11 వ రోజు భారత్ మూడు స్వర్ణాలు, ఐదు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి 12 పతకాలు
సొంతం చేసుకుంది.
316 పతకాలు సాధించి చైనా పతకాల జాబితాలో తొలి
స్థానంలో నిలవగా 147 మెడల్స్ తో జపాన్ రెండో స్థానానికి పరిమితమైంది. దక్షిణ
కొరియా 148 పతకాలతో మూడో స్థానంలో ఉండగా 82 మెడల్స్ సాధించి భారత్ నాలుగో స్థానాన్ని
కైవసం చేసుకుంది. భారత్ తర్వాతి స్థానంలో ఉజ్బెకిస్తాన్ ఉంది.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్