ముఖ్యమంత్రి
జగన్ దిల్లీ పర్యటనలో మార్పు చోటుచేసుకుంది. ముందస్తు ప్రణాళిక మేరకు ఈ నెల 6న ఆయన
దిల్లీకి వెళ్ళాల్సి ఉండగా షెడ్యూల్ లో మార్పులు జరిగాయి. రేపు ఉదయం 10 గంటలకు ఆయన
హస్తినకు బయలు దేరతారు.
సీఎం
దిల్లీ టూర్ నేపథ్యంలో కాకినాడ జిల్లా సామర్లకోటలో రేపు జరగాల్సిన జగనన్న సామూహిక
గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని వాయిదా వేశారు.
మరోవైపు దిల్లీ పర్యటనలో ప్రధాని
మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో భేటీ కానున్నారు. మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుపై వీరి
మధ్య చర్చ జరిగే అవకాశముంది.
శుక్రవారం వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం నిర్వహించే
సమావేశానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి
విజయవాడ నుంచి దిల్లీ పయనమవుతారు. వన్ జన్పథ్ నివాసంలో రాత్రి బస చేస్తారు.